News

రేపటితో ముగియనున్న రైతు భీమా దరఖాస్తుల గడువు ..

Srikanth B
Srikanth B
రేపటితో ముగియనున్న రైతు భీమా దరఖాస్తుల గడువు ..
రేపటితో ముగియనున్న రైతు భీమా దరఖాస్తుల గడువు ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుభీమా కు సంబంధించి కీలక ప్రకటన చేసింది . కొత్తగా పట్టాదారు పాసుబుక్ పొందిన రైతులకు కూడా రైతుభిమా పథకాన్ని వర్తింపచేసే విధంగా రైతుభీమా పథకం నమోదు ప్రక్రియ ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైనవి. కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ పొంది ఒక గుంట వ్యవసాయ భూమి కల్గిన రైతు కూడా రైతుభిమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా గతంలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని రైతులుకూడా రైతు భీమా దరఖాస్తును సమర్పించవచ్చు .

జులై 10 నుంచి ప్రారంభం అయ్యే దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 5 తేదీ తో ముగుస్తుంది . అర్హులైన 18 మరియు 59 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు మరియు జూన్ 18వ తేదీకి ముందు పట్టాదారు పాస్‌బుక్‌ని పొందిన రైతులు ఆగస్టు 5 వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించాలి.

జూన్ 18 కు ముందు పట్టాదార్ పాస్ బుక్ పొందిన రైతులు మండల వ్యవసాయ అదికారి వద్ద తామ దరఖాస్తు ను సమర్పించవచ్చు. దరకాస్తు సమర్పించడానికి ఆధార్ కార్డు , పట్టాదార్ పాస్ బుక్ , బ్యాంకు పాస్ బుక్ వివరాలు అవసరం , ఇప్పటికి రైతుభిమా కోసం నమోదు చేసుకొని రైతులు జులై 10 నుంచి తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.


రైతు భీమా పథకం ఏమిటి ?



2018 వ సంవత్సరం లో ప్రారంభమైన ఈ పథకం ఏదైనా కారణం వల్ల రైతు ప్రాణాలు కోల్పోతే, కుటుంబ సభ్యులు ఆర్థిక సాయం ఈ పథకం లో నమోదు చేసుకున్న రైతు సహజంగా లేదా ఏదైనా కారణం వల్ల మరణించినట్లయితే 5 లక్షల భీమా .10 రోజులలోపునామినీ ఖాతాలో జమ చేయబడుతుంది ఇప్పటివరకు 42 వేల కుటుంబాలకు రైతు భీమా పథకం క్రింద 5 లక్షల ఆర్థిక సాయం అందించబడింది.

Related Topics

Raithu Bandu

Share your comments

Subscribe Magazine