టమాటో లేనిది కూర ఎలా వండాలి అని ఆలోచించే స్థాయికి టమాటో మరియు మనుషులకు బంధం ఏర్పడింది .. పెరిగిన ధరలతో ఇప్పుడు వంటగదిలో టొమాటోలు కనిపించకుండా పోతున్నాయి. ధరలు పెరిగి నేల అయిన టమాటో ధరలు దిగి రాలేదు ఇప్పుడైనా కొత్త టొమాటోలు మార్కెట్ లోకి వచ్చి ధరలు తగ్గుతాయని భావించిన రెండు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు ధరలు ఇప్పుడే తగ్గే అవకాశాలు లేవని తెలుస్తుంది.
మంగళవారం,01 ఆగస్టు మదనపల్లె మార్కెట్లో టమాటా ట్రే రేటు రూ. 5,600 పలికింది. అంటే, కిలో ధర రూ. 224కు చేరింది. ఇది హోల్సేల్ రేటు. రిటైల్ మార్కెట్లో కిలో టమాటాను నాణ్యతను బట్టి రూ. 250 నుంచి రూ. 300 వరకు చెబుతున్నారు. ఇటీవలి వర్షాలకు తెలంగాణలో పంట పాడైపోవడంతో, అక్కడ కూడా దాదాపు ఇదే రేటు పెట్టి కొనాల్సి వస్తోంది.
టమాటా ధర భారం నుంచి సామాన్యులకు ఊరట కల్పించడానికి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, 'ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్' (ONDC) ఆన్లైన్లో చౌకగా టమాటాలు అమ్మడం స్టార్ట్ చేసింది. ఈ ప్రయత్నం ఫలించింది, కేవలం ఒక వారం రోజుల్లోనే దిల్లీలో 10,000 కిలోలకు పైగా టమాటాలను డిస్కౌంట్ రేటుకు అమ్మింది. డిస్కౌంట్ అంటే పదో, పరకో తగ్గించడం కాదు. కిలో టమాటాలను కేవలం 70 రూపాయలకే సెల్ చేసింది. ఇవన్నీ 'హోమ్ డెలివెరీ' ఆర్డర్స్.
తెలంగాణలో వరదల ధాటికి 5.5 లక్షల ఎకరాల్లో పంటనష్టం
మీరు కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్' (ONDC) ఆన్లైన్లో చౌకగా టమాటాలు టొమాటోలు కొనుకోవచ్చు . ONDC అనేది ప్రభుత్వ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్లాట్ ఫార్మ్ దీనిలో మీరు తక్కువధరకు వస్తువులను పొందవచ్చు.
Share your comments