News

ఈ వారంలోనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల విడుదలకు TSPSC కసరత్తు ...

Srikanth B
Srikanth B
TSPSC
TSPSC

రాష్ట్ర తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదలకు TSPSC కసరత్తు పూర్తిచేసింది. నాలుగైదు రోజుల్లో పరీక్ష ఫలితాలు సహా మెయిన్స్‌ షెడ్యూలు ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది

తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తిచేసింది. నాలుగైదు రోజుల్లో పరీక్ష ఫలితాలు వెల్లడించాలని భావిస్తోంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలతో పాటు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు ప్రకటించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌ చివరి వారంలో ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపింది.

TSPSC గ్రూప్-I ప్రిలిమ్స్ తుది "కీ ' విడుదల ,5 ప్రశ్నల తొలగింపు..

అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు మరియు 25,150 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అంటే 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయనున్నారు.


150 ప్రశ్నలలో ఐదు ప్రశ్నలు తొలగించబడినందున, 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను లెక్కించి 150 మార్కులకు హేతుబద్ధం చేస్తామని వర్గాలు తెలిపాయి. ఉదారణకు 145 మార్కులకు 120 వస్తే 150కి లెక్కించి 124.137గా నిర్ణయిస్తారు. ఇలా మూడో డెసిమల్‌ పాయింట్‌ వరకు పరిగణనలోకి తీసుకొని తుది మెరిట్‌ జాబితాను కమిషన్‌ రూపొందిస్తోంది.అంటే ప్రధాన పరీక్షకు మొత్తం 25,150 మందిని ఎంపిక చేయనుంది. ఈ మేరకు మల్టీజోన్లు, రిజర్వుడు వర్గాల వారీగా జాబితాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఫలితాలు ఈ వారంలోనే ఇవ్వాలని భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీ ముందస్తు ప్రణాళిక ప్రకారం శుక్ర లేదా శనివారం వెల్లడయ్యే అవకాశాలున్నాయి.  ఆలస్యమైతే సోమవారానికి ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తిచేయనుంది.

TSPSC గ్రూప్-I ప్రిలిమ్స్ తుది "కీ ' విడుదల ,5 ప్రశ్నల తొలగింపు..

Related Topics

TSPSC TSPSCgroup2

Share your comments

Subscribe Magazine

More on News

More