Education

TSPSC గ్రూప్-I ప్రిలిమ్స్ తుది "కీ ' విడుదల ,5 ప్రశ్నల తొలగింపు..

Srikanth B
Srikanth B

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మంగళవారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.
విడుదల చేయబడిన ఫైనల్ కీ ప్రకారం , ఐదు ప్రశ్నలు తొలగించబడ్డాయి మరియు ప్రో-రేటా లెక్కింపు ఆధారంగా అభ్యర్థులకు తొలగించబడిన అన్ని ప్రశ్నలకు మార్కులు జోడించబడతాయి.

150 ప్రశ్నలలో ఐదు ప్రశ్నలు తొలగించబడినందున, 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను లెక్కించి 150 మార్కులకు హేతుబద్ధం చేస్తామని వర్గాలు తెలిపాయి.ఉదాహరణకు, ఒక అభ్యర్థి 145లో 120 ప్రశ్నలను సరిగ్గా ప్రయత్నించినట్లయితే, అతను 145 మార్కులకు 120 మార్కులను పొందుతాడు. అప్పుడు, 150 కోసం పొందిన మార్కుల కోసం గణన (ప్రో-రేటా గణన) క్రింది విధంగా చేయబడుతుంది:

145కి 120 మార్కులు వస్తే, 150కి వచ్చిన మార్కులను 150ని 145తో భాగించి 120తో గుణిస్తే 124.137కి సమానం. కాబట్టి, 150కి వచ్చిన మార్కులు 124.137. మూలాలు వివరించాయి.

దీనితో TSPSC GROUP 1 మార్కులు కూడా తగ్గనున్నాయి . దీనితో అభ్యర్థులలో కటాఫ్ విషయంలో మరింత గందరగోళం నెలకొంది . మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేయగా.. 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో దాదాపు 3.20 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. 2 లక్షల 86 వేల 51 మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. అంటే 75 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

స్కూల్ పిల్లకోసం పోస్ట్ ఆఫీస్ అద్భుత పథకం .. నెలకు రూ . 2475 ఆదాయం !

పరీక్ష ఫలితాలు :

పరీక్షా ఫలితాలు కటాఫ్ మార్కుల పై ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చిన TSPSC, కటాఫ్ మెరిట్ ఆధారంగ కాకుండా రిజర్వేషన్ ప్రకారం ఒక్కో ఖాళీ భర్తీకి 1:50 నిష్పత్తి లో అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు . దీనితో కేటగిరి ప్రకారం కటాఫ్ మార్కులు తగ్గే అవకాశము వుంది మరియు రిజర్వేషన్ ను హారిజాంటల్ గ అమలు చేయాలా లేదా పాత విధానం ప్రకారం భర్తీ చేయాలా నేనే విషయం పైన కూడా వారం పది రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది . దీనితో రిజర్వేషన్ అమలుపై స్పష్టత వచ్చిన వెంటనే TSPSC GROUP 1( గ్రూప్ 1 ) ఫలితాలను వెల్లడించనుంది . దీనితో ఫలితాలు ఎపుడనే విషయం పై TSPSC ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు .

స్కూల్ పిల్లకోసం పోస్ట్ ఆఫీస్ అద్భుత పథకం .. నెలకు రూ . 2475 ఆదాయం !

Related Topics

TSPSC GROUP 1 APPSC

Share your comments

Subscribe Magazine