Education

అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2025: ఏప్రిల్10వ తారీఖే చివరి తేదీ, ఇవే అర్హతలు!

Sandilya Sharma
Sandilya Sharma
Agniveer recruitment 2025- Agnipath registration last date (Image Courtesy- Pexels)
Agniveer recruitment 2025- Agnipath registration last date (Image Courtesy- Pexels)

భారత దేశానికి సేవ చేసే గొప్ప అవకాశంగా అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ రిక్రూట్మెంట్ కొనసాగుతోంది. భారత సైన్యంలో చేరి గౌరవం, క్రమశిక్షణ, మరియు భద్రతను పొందే అవకాశాన్ని యువత వినియోగించుకోవచ్చు (Indian Army 2025 vacancy).

అగ్నివీర్ రిక్రూట్మెంట్ 2025: ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 12 మార్చి 2025
  • దరఖాస్తు చివరి తేదీ: 10 ఏప్రిల్ 2025
  • ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: జూన్ 2025 (Agniveer exam date June 2025)

ఎలా దరఖాస్తు చేయాలి (Agnipath scheme apply online)?

  • ఆధికారిక వెబ్‌సైట్ (joinindianarmy.nic.in) లోకి వెళ్లండి.
  • 'Agniveer Apply/Login' లింక్‌ను ఎంచుకోండి.
  • కొత్త వినియోగదారులు రిజిస్టర్ చేసుకోవాలి, లేదా లాగిన్ అవ్వాలి.
  • అన్ని వివరాలను సరిగ్గా నింపి, ఫీజును చెల్లించాలి.
  • దరఖాస్తును సమర్పించి, ప్రింట్ తీసుకోవాలి.

ఎంపిక విధానం

  • రాత పరీక్ష: జూన్ 2025 లో నిర్వహించబడుతుంది.
  • శారీరక పరీక్ష: లిఖిత పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నిర్వహించబడుతుంది.

అర్హత వివరాలు (Agnipath eligibility)

  • వయస్సు: 17-21 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • విద్యార్హత:

    • అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD): కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత.

    • అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్: కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత.

అవసరమైన పత్రాలు

  • 10వ తరగతి సర్టిఫికేట్

  • వ్యక్తిగత ఇమెయిల్ చిరునామా

  • మొబైల్ నంబర్

  • నివాస ధృవీకరణ పత్రం (రాష్ట్రం, జిల్లా, తహశీల్ వివరాలతో)

  • స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో

అలాగే, హవిల్దార్, జూనియర్ కమిషన్ ఆఫీసర్, రిలిజియస్ టీచర్ జూనియర్ కమిషన్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, సెపాయ్ ఫార్మా వంటి ఇతర రిక్రూట్మెంట్లు కూడా జరుగుతున్నాయి.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, దేశ సేవలో పాల్గొనాలనుకునే యువత ఏప్రిల్ 10, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని భారత ఆర్మీ ఉద్యోగావకాశాల(Indian army recruitment Telugu), అలానే ఇతర సమాచారం కోసం 

Read More:

తెలంగాణ హైకోర్టు పరీక్ష తేదీలు విడుదల – ఏప్రిల్ 15 నుంచి CBT & స్కిల్ టెస్ట్

LPG గ్యాస్ ధరలు 50 Rs పెంపు – సామాన్యుడిపై మరో భారం

Share your comments

Subscribe Magazine

More on Education

More