Education

వ్యవసాయ యూనివర్సిటీలలో ఆన్లైన్ కోర్సులు.... ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ఎంతోమంది యువత, వ్యవసాయ యొక్క విశిష్టతను గుర్తించి దీనివైపుగా అడుగులువెయ్యసాగారు. కంప్యూటర్ ఉద్యోగాలు వదిలి పల్లె బాట పట్టి వ్యవసాయంలో అపూర్వ విజయాలు సాధించిన ఘనులెందరినో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే ఎంతోమందికి వ్యవసాయం చెయ్యాలని ఉన్నా ఎక్కడనుండి మొదలుపెట్టాలో అవగాహనా లేక సతమతమవుతుంటారు. వ్యవసాయం మీద పూర్తి అవగాహాన లేకపోవడం, మరియు మార్గదర్శిగా నిలిచేవారు లేకపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే యువతకు మరియు వ్యవసాయం పట్ల ఆశక్తి ఉన్న ప్రతీ ఒక్కరికి వ్యవసాయంలో వివిధ రంగాలపై అవగాహనా పెంచేందుకు ఎన్.జి. రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టింది.

ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఆన్లైన్ అగ్రికల్చర్ సర్టిఫికెట్ కోర్సులకు, దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఈ కోర్సులలో పాల్గొనే అభ్యర్థులు తమ ఇంటివద్ద నుండే ఈ కోర్సులలో పాల్గొని వ్యవసాయ జ్ఞానాన్ని పొందవచ్చు. ఈ కోర్సులలో పాల్గోవాలి అనుకునే అభ్యర్థులు జూన్ 30లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుల కార్యక్రమాన్ని, గుంటూరులోని, బాపట్లలో ఉన్న ఆచార్య ఎన్.జి రంగా, అగ్రికల్చర్ యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం వారు నిర్వహిస్తున్నారు.

జీవన ఎరువుల తయారీ, మిద్దె తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, ఇలా వివిధ వ్యవసాయ రంగాల్లో సర్టిఫికెట్ కోర్సులను అందించనున్నారు. కోర్సులకు దరఖాస్తులు పూర్తయిన తరువాత, జులై నుండి ఆన్లైన్ ట్రైనింగ్ తరగతులుంటాయని ఆ కాలేజీ రెజిస్ట్రర్ కే. గురువారెడ్డి తెలిపారు. ఈ కోర్సుల వ్యవధి రెండు వారలు, అంటే సెప్టెంబర్ వరకు ఈ కోర్సులు కొనసాగుతాయి. ప్రతి కోర్సుకి ఏడు ఆన్లైన్ క్లాసులు మరియు ఒక ప్రాక్టికల్ క్లాస్ స్టడీ సెంటర్లో నిర్వహిస్తారు. కోర్స్ చివరిలో ఆన్లైన్లో ఒక పరీక్ష ఉంటుంది, ఆ తరువాత సర్టిఫికెట్ అందిస్తారు. పరీక్షలు తెలుగులో కూడా రాయవచ్చు, అంతేకాకుండా ఈ కోర్సులో పాల్గొనేందుకు ఎటువంటి వయసు పరిమితి లేదు, ఔత్షకులు ఎవరైనా పాల్గొనవచ్చు.

ఈ కోర్సులో పాల్గోవాలి అనుకునేవారు, ఎన్.జి రంగా యూనివర్సిటీ వెబ్సైటు నుండి అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకొని, మీ యొక్క వివరాలు నింపి, దీనికి ఫీజు చెల్లించిన రసీదును జత చేసి, ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కు పోస్ట్ ద్వారా పంపించాలి. ఒక్కో కోర్సుకు 1500 రూపాయిలు చెల్లించవలసి ఉంటుంది.

పోస్టల్ అడ్రస్: OPEN DISTANCE LEARNING CENTRE, O/O DEAN OF AGRICULTURE, ACHARYA N G RANGA AGRICULTURAL UNIVERSITY, ADMINISTRATIVE OFFICE BUILDING, LAM, GUNTUR – 522034

బ్యాంకు వివరాలు:

అకౌంట్ నెంబర్: 031410100093292
ఐఏఫ్ఏస్సీ కోడ్: UBIN0803146
బ్రాంచ్ : కొరిటిపాడు, గుంటూరు (చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు)
బ్యాంకు డిడి తియ్యడానికి ఈ పేరును వాడవలసి ఉంటుంది: OPEN AND DISTANCE LEARNING CENTRE, ANGRAU, payable at Guntur, A.P

మరిన్ని వివరాల కోసం ఎన్.జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వెబిసైట్ www.angrau.ac.in లేదా ఫోన్ నెంబర్: 8008788776 మరియు ఈ-మెయిలు అడ్రస్ angrau.odlc@gmail.com ద్వారా వారిని సంప్రదించవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on Education

More