తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) మేనేజింగ్ డైరెక్టర్, VC సజ్జనార్ , ప్రయాణీకుల కోసం 500 ml మరియు 1 లీటర్ వాటర్ బాటిళ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.అయితే దీనికి మంచి పేరుని సూచించిన వారికి బహుమతి లభించనున్నట్లు తెలిపారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చదవండి.
బస్సు ప్రయాణాలు చేస్తున్నప్పుడు త్రాగు నీరు మరిచిపోతే ఇక చింతించాల్సిన అవసరం లేదు.దీని పరిష్కరానికి తెలంగాణ ఆర్టీసీ (TSRTC) వినూత్న ఆలోచనకి తెర తీసింది. త్వరలో టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ అందుబాటులోకి రానున్నాయి. వాటర్ బాటిల్ డిజైన్ మరియు పేరును సూచించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరారు. వాటర్ బాటిల్ పేరు, డిజైన సూచించి విలువైన బహుమతి గెలుచుకోండని టీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటన చేసింది.
ఎవరైతే ఉత్తమ డిజైన్‌తో పాటు పేరుని సూచిస్తారో వారికి బహుమతి ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు. ఆర్టీసీ ప్రయాణికుల కొరకు 500 ml మరియు 1 లీటర్ వాటర్ బాటిళ్లన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నాం అని. సూచనలను వాట్సాప్ నంబర్ 94409 70000కు పంపండి’ అంటూ ట్వీట్ చేశారు.
TSRTC చేసే చారిత్రాత్మక మార్పునకు మీ తోడ్పాటు ఇవ్వండి. చరిత్రలో నిలిచిపోండి. వాటర్ బాటిల్‌కు మంచి పేరు, డిజైన్ చెప్పండి. రివార్డ్స్ గెలుచుకోండి’ అంటూ తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ట్వీట్ చేశారు VC సజ్జనార్. ఇప్పటికే జనాలు ట్విట్టర్ లో వారికి తోచిన పేర్లను వెల్లడిస్తున్నారు. అయితే ఈ బహుమతి ఎవరికీ వరించనుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది.
మరిన్ని చదవండి.
Share your comments