Health & Lifestyle

వేకువజామున నీరు తాగటం వలన కలిగే ప్రయోజనాలు,ప్లాస్టిక్ బాటిల్లో నీరు త్రాగితే ఏమవుతుంది?

S Vinay
S Vinay

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం.మానవ శరీరం సుమారుగా 70% నీటితో తయారై ఉంటుంది.మన శరీరానికి తగిన నీటిని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉండాలి.

అయితే వేకువ జామున నీరు త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.


ఖాళీ కడుపుతో నీరు త్రాగటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా వేకువ జామున ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గించవచ్చు.

జీర్ణ వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగటం వల్ల మెటబాలిక్ రేట్ ని 24% పెంచుకోవచ్చు.

నీరు పొట్టలోని ఆమ్లతను తగ్గిస్తుంది, తద్వారా శరీరం తేలికగా అవుతుంది.

రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

తెల్లవారుజామున నీరు తాగటం వలన శరీరం లోని విషాలు (toxins) బయటకు త్వరగా వెలుతాయి.

నిద్రలేచిన వెంటనే కనీసం అర్ధ లీటరు (500 ml ) నీటిని తీసుకోవడానికి ప్రయత్నించాలి.

ఆహారం తీసుకునే ముందు కానీ వెంటనే కానీ నీటిని తాగకూడదు కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఆహారం తిన్న వెంటనే నీటిని ఎక్కువ మొత్తం లో తీసుకుంటే జీర్ణ శక్తికి అంతరాయం ఏర్పడుతుంది.


ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు త్రాగడం వలన కలిగే అనర్థాలు:

ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రజలు నీటిని తాగటానికి ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే.

ప్లాస్టిక్‌లో థాలేట్స్ అనే రసాయనం ఉండటం వల్ల, ప్లాస్టిక్ బాటిళ్ల నుండి నీరు తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్లాస్టిక్ బాటిళ్ల లో నీటిని ఎక్కువగా నిల్వ చేయడం వల్ల ఫ్లోరైడ్, ఆర్సెనిక్ వంటి విష రసాయనాలు ఉత్పత్తి అవుతాయి వీటిని తాగటం శరీరానికి హానికరం.

నీటిని తాగటానికి రాగి బాటిళ్లను వాడటం ఉత్తమం.

మరిన్ని చదవండి.

రాగి పాత్రలలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

Share your comments

Subscribe Magazine