News

'మదర్స్ డే' స్పెషల్ ఆఫర్ .. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం !

Srikanth B
Srikanth B

తెలంగాణ RTC ఈ నెల 8న మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులకు TSRTC ఆఫర్ ప్రకటించింది. ఆరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది.

ఛార్జీల బాదుడుతో ఓవైపు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ... ఆర్టీసీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రయాణికుల మెప్పు పొందుతున్నాయి. తాజాగా తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రయాణికుల  హర్షం వ్యక్తం చేస్తున్నారు .

ఈ నెల 8న మదర్స్ డేని పురస్కరించుకుని... ఆరోజు RTC బస్సుల్లో చంటిబిడ్డల తల్లులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఐదేళ్ల లోపు పిల్లలతో ప్రయాణించే తల్లులకు మాత్రమే ఈ ఫ్రీ జర్నీ సదుపాయం వర్తిస్తుంది.

RTC తాజా నిర్ణయంపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ... మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులకు కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలతో ప్రయాణించే తల్లులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏసీ సర్వీస్ సహా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

త్యాగాల మూర్తి  అమ్మ ప్రేమను, అనురాగాన్ని వెలకట్టలేమని... ఆ త్యాగమూర్తి సేవలను గుర్తిస్తూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని సజ్జనార్ వెల్లడించారు. TSRTC సామాజిక దృక్పథంతో ముందడుగు వేస్తోందని... ఉమెన్స్ డే, చిల్డ్రన్స్ డే సందర్భంగా కూడా రాయితీలు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవలే నిరుద్యోగ యువతకు బస్ పాసుల్లో రాయితీ ఇచ్చినట్లు MD సజ్జనార్ వెల్లడించారు.

Telangana inter exam: జూన్ 24లోగా ఇంటర్ ఫలితాలు!

Share your comments

Subscribe Magazine