News

ఉగాది పర్వదినాన TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం !

Srikanth B
Srikanth B

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శనివారం 65 ఏళ్లు పైబడిన వారికి ఉచిత ప్రయాణాని అందించనుంది .

ఈ ఉగాది సందర్భంగా టీఎస్ఆర్టీసీ సీనియర్ సిటిజన్లకు (65+) ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోందని వీసీ, ఎండీ, టీఎస్ఆర్టీసీ వీసీ సజ్జనార్ తెలిపారు.

ఈ పండుగను కుటుంబాలతో జరుపుకోవడానికి ఈ సేవను ఉపయోగించుకొని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అలాగే, యాదగిరిగుట్టకు మినీ బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ ఇటీవల జెండా ఊపి ప్రారంభించింది. జేబీఎస్, ఉప్పల్, భువనగిరి, యాదగిరిగుట్ట నుంచి భక్తులకు ఈ బస్సులు సేవలు అందించనున్నాయి

భవిష్యత్తులో డిమాండ్ ను బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని, బాసర, వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి యాదగిరిగుట్టకు సర్వీసులను అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Ugadi 2022:ఉగాది 2022: చరిత్ర, ప్రాముఖ్యత .. ఉగాది ని ఏయే రాష్ట్రాలు జరుపుకుంటాయి !

Related Topics

RTC Buses Freeride

Share your comments

Subscribe Magazine