News

రూ.2వేల నోటు రద్దు పై క్లారిటీ ఇచ్చినా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌!

Srikanth B
Srikanth B
రూ.2వేల నోటు రద్దు పై క్లారిటీ ఇచ్చినా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌!
రూ.2వేల నోటు రద్దు పై క్లారిటీ ఇచ్చినా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌!

నోట్ల రద్దు తరువాత ప్రభుత్వం మొదటి సరిగా రూ.2వేల నోటును చలామణిలోకి తీసుకువచ్చింది , అయితే నోటు విడుదలైన మొదట్లో అందరి చేతులలో కనిపించే రూ.2వేల నోటు క్రమ క్రమం గ కనుమరుగవుకుంటూ వస్తుంది ఈ క్రమంలో అందరిలో ఒకటే సందేహం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రూ.2వేల నోటు ను తగ్గించుకుంటూ వస్తుందని ఈ నేపథ్యంలో ఏటీఎం కేంద్రాల్లో రూ.2వేల నోటు లభ్యతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిచ్చారు.

ఏటీఎం కేంద్రాల్లో కూడా నోటు కన్పించడం లేదని చాలామంది ఆరోపణలు చేసారు దీనితో ఏటీఎం కేంద్రాల్లో నోట్లను అందుబాటులో ఉంచడమనేది బ్యాంకుల స్వతంత్ర నిర్ణయమని, కాలానికి అనుగుణంగా, ఖాతాదారుల అవసరాలను బట్టి నోట్లను జమ చేస్తుంటాయని స్పష్టత ఇచ్చారు.

దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. రూ.500 నోటుతోపాటు కొత్తగా రూ.2వేల నోటు కూడా చెలామణిలోకి రావడంపై విమర్శలు వచ్చాయి. రూ.వెయ్యి నోటు రద్దుచేసిన తర్వాత రూ.2వేల నోటును ఎలా తీసుకొస్తారంటూ విపక్షాలు ప్రశ్నించాయి. తాజాగా మంత్రి ఇచ్చిన సమాధానాన్ని బట్టి రూ.2వేల నోటును ఆర్బీఐ రద్దుచేయలేదనేది స్పష్టమైంది.

పంట నష్టపోయిన రైతులు .. ఫసల్ బీమా యోజన డబ్బుల కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా!

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం.. 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న రూ.500, రూ.2000 వేల నోట్ల విలువ రూ.9.512 లక్షల కోట్లు కాగా.. 2022 మార్చి నాటికి ఆ మొత్తం రూ.27.057 లక్షల కోట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు.

పంట నష్టపోయిన రైతులు .. ఫసల్ బీమా యోజన డబ్బుల కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా!

Related Topics

2000 rupee notes

Share your comments

Subscribe Magazine