హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది పర్యాటకులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.సంగ్లా-చిత్కుల్ రహదారిలలో బత్సేరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన వారందరూ ఢిల్లీకి చెందిన వారేనని అధికారులు తెలియజేశారు.
హిమాచల్ ప్రదేశ్ లోనే కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈవిధంగా కొండచరియలు విరిగిపడి
బత్సేరి లోయలో ఉన్న ఓ బ్రిడ్జిపై పడటంతో బ్రిడ్జి కోల్పోవడమే కాకుండా అక్కడే ఆగి ఉన్నటువంటి కార్లపై పడటంతో కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే చిత్కుల్ నుంచి సంగ్లాకు వెళ్తున్న ఓ వాహనంపై పెద్ద పెద్ద బండరాళ్లు పడటం చేత ఆ వాహనంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ విధంగా కొండచరియలు విరిగి పడుతున్న దృశ్యాలను స్థానికులు వీడియోగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో కొండచరియలు ఏదో పెద్ద భూకంపం సంభవించినట్లుగా పెద్ద పెద్ద బండరాళ్లు ఒక్కసారిగా కింద పడుతున్న దృశ్యాలను చూడవచ్చు. అయితే ఈ కొండ చర్యలు కేవలం రహదారిపై మాత్రమే కాకుండా పర్యాటకులు విశ్రాంతి తీసుకుని గదులపై కూడా పడటంతో అధికంగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలను చేపడుతున్నట్లు తెలుస్తోంది.
Share your comments