ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ విద్యార్థి చదుకోవాలనే ధ్యేయంతో జగనన్న విద్యాదివేన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్షిప్ పథకం ద్వారా విద్యార్థులకు చదువుకోవడానికీ మరియు ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం ఆర్ధికంగా సహాయం చేస్తుంది. విద్యాదివేన పథకం యొక్క నాల్గవ విడత డబ్బును ఈ నెల అనగా మర్చి 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అకౌంటుల్లోకి జమ చేశారు.
కానీ జగనన్న విద్యా దీవెన కింద నిధులు విడుదల చేసినప్పటికీ కొంత మంది విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీనికి కారణం విద్యార్థుల బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ చేసుకోవపోవడం అని అధికారులు అంటున్నారు. విద్యార్థులు విద్యదివేన డబ్బులను పొందడానికి తమ వివరాలను పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్‌డేట్ చేసుకోవాలి. తమ వివరాలను ఈ నెల 25వ తేదీలోగా అప్‌డేట్ చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ఎస్‌పీఎస్‌ఎన్ రెడ్డి తెలియజేసారు.
ప్రస్తుతం ఈ విద్యాదివేన సొమ్మును విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కానీ గతంలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థుల విద్యాదివేన సొమ్మును వారి తల్లుల అకౌంట్లో జమ చేసేవారు. ఆధార్ మరియు ఎన్‌పీసీఐ విద్యార్థుల బ్యాంకు అకౌంట్ కు అనుసంధానం కానందున ఖాతాల్లో విద్యాదివేన డబ్బులు జమ కాలేదన్నారు.
ఇది కూడా చదవండి..
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ తేదీల్లో అధిక వర్షాలు..
కర్నూలు జిల్లాలో 2,532 మంది విద్యార్థుల తమ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకోలేదని తెలిపారు. సుమారుగా 1,034 మంది విద్యార్థులు ఈ నెల 19 నాటికి వివరాలను అనుసంధానం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ఇంకా 1,498 మంది విద్యార్థులు వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిఉంది. ఈ విద్యార్థులందరూ విద్యాదివేన డబ్బులను పొందడానికి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ను లింక్ చేసి, పోస్టాఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేసి తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టల్ ఖాతాను ఈ నెల 25లోగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి..
Share your comments