News

ఒకే ఊరు 40 యూట్యూబ్ ఛానల్ లు ,జీవనోపాధికై యూట్యూబ్‌ ఛానెల్స్‌ పై ఆధారపడిన గ్రామం..

Srikanth B
Srikanth B

ప్రపంచం సాంకేతికత వైపు పరుగులుతీస్తుంది దాన్ని అందిపుచ్చుకున్న ఒక గ్రామము జీవనోపాధికోసం ఏకంగా యూట్యూబ్‌ నే ఉపాధి గ మలుచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్‌ జిల్లాలోని తుల్సి ఊళ్లో ఎక్కువమంది యువత యూట్యూబ్‌నే జీవనోపాధిగా ఎంచుకున్నారు. మూడువేల మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో 40 యూట్యూబ్‌ ఛానెల్స్‌ ఉన్నాయి. ఊళ్లో 40 శాతం మంది యూట్యూబ్‌ వీడియోలు చేస్తున్నారు. కంటెంట్‌ క్రియేట్‌ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.

ఆగ్రామంలో ఎటుచూసినా కెమెరాలు, వాటి స్టాండ్లే కనిపిస్తాయి. వీధుల్లో ఏ మూల చూసినా యూట్యూబ్‌ వీడియోల షూటింగ్స్‌తో బిజీగా ఉంటారు.

ఈ ఊళ్లో యూట్యూబ్‌ కల్చర్‌ జ్ఞానేంద్ర శుక్ల, జై వర్మ అనే ఇద్దరు స్నేహితులతో మొదలైంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో నెట్‌వర్క్‌ ఇంజినీర్‌గా పని చేసిన జ్ఞానేంద్ర, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివి టీచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ పెట్టుకున్న జై వర్మ ఇద్దరూ వాళ్లు చేస్తున్న జాబ్‌ మానేసి 2012లో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టారు. దాంట్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు చేస్తూ, సొసైటీకి ఉపయోగపడే మెసేజ్‌లు ఇచ్చేవాళ్లు. 1.15 లక్షల సబ్‌స్ర్కయిబర్లు ఉన్న వీళ్ల ఛానెల్‌లో ఇప్పటివరకు 250కి పైగా వీడియోలు అప్‌లోడ్‌ చేశారు.

అప్పుడే టిక్‌టాక్‌ వీడియోల ట్రెండ్‌ మొదలైంది. అందరికీ మొబైల్‌ ఫోన్లు ఉండటం వల్ల వాళ్లూ రీల్స్‌ చేయడం మొదలుపెట్టారు. జై, జ్ఞానేంద్రల వీడియోలకు యూట్యూబ్‌నుంచి డబ్బు వస్తుందని తెలుసుకొని మిగతా వాళ్లకూ యూట్యూబ్‌లో వీడియోలు పెట్టాలనే ఆలోచన వచ్చింది. దాంతో అందరూ ఛానెల్స్‌ పెట్టి వీడియోలు అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టారు. అలా ఆ ఊరి యూట్యూబ్‌ ఛానెల్స్​ నుంచి ఇప్పటివరకు ఎడ్యుకేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, షార్ట్‌ ఫిల్మ్స్‌, వ్లాగ్స్‌... ఇలాి రకరకాల వీడియోలు వస్తున్నాయి.

ఆడవాళ్లను చదివించడానికి ఇష్టపడని ఆ గ్రామంలో ఇప్పుడు ఏకంగా యూట్యూబ్ ను జీవనోపాధిగా చేసుకొని ఆడవాళ్ళు సైతం డబ్బులను సంపాదిస్తున్నారు . సాంకేతికత జీవనోపాధి తో పాటు తమలో ఆత్మదైర్యాన్ని ఇచ్చిందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

తెలుగు రాష్ట్రాలకు రానున్న 3 రోజుల పాటు వర్షాలు ...

Related Topics

Chhattisgarh youtube

Share your comments

Subscribe Magazine