News

ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన ప్రజలు.. సొంత డబ్బులతో వంతెన కట్టుకున్న గ్రామస్తులు?

KJ Staff
KJ Staff

సాధారణంగా రైతు బతకాలంటే వ్యవసాయం చేయాల్సిందే. వ్యవసాయం చేయాలంటే తప్పనిసరిగా నీటి అవసరం ఉంటుంది.ఈ క్రమంలోనే రైతులు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని దేవుడికి ప్రార్థిస్తారు. కానీ ఈ గ్రామంలోని రైతులు మాత్రం వర్షం మాత్రం పడకూడదని దేవుడికి ప్రార్ధిస్తుంటారు.ఎందుకంటే ఆ గ్రామంలో వర్షం పడితే గ్రామస్తులు కాలు బయట పెట్టడానికి వీలు ఉండదు.ఈ క్రమంలోనే వారి జీవనం స్తంభించి పోతుందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఏమిటి? ఆ గ్రామంలో ఉన్న సమస్య ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం

ఒడిశాలోని బలంగిర్‌ జిల్లా, మహులపాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కుతురకేంద గ్రామం ఉంది. ఈ గ్రామం చుట్టూ మూడు వాగులు ఉన్నాయి. వర్షాకాలం మొదలైతే చాలు ఈ వాగులు పొంగి ఆరడుగుల వరకు నీరు నిలబడతాయి.ఈ విధంగా వాగు ఉధృతి అధికంగా ఉండటం చేత ఈ గ్రామంలో నివసించే ప్రజల జీవనం స్తంభించి పోతుంది. నిత్యావసరాలు తెచ్చుకోవాలన్న ఇబ్బందులే, ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఆస్పత్రికి చూపించడానికి కూడా వీలు కుదరదు. ఇక విద్యార్థులు సైతం తమ పాఠశాలలకు కాలేజీలకు సెలవులు ప్రకటించుకుంటారు.ఇలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ గ్రామ ప్రజలు ఎన్నో సార్లు ఆ గ్రామంలో వంతెన నిర్మించాలని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించుకున్నారు.

ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు నివేదికలు ఇచ్చిన అధికారులు మాత్రం వీరు సమస్యలు పెడచెవిన పెట్టారు. ఇక అధికారుల తీరుకు విసిగిపోయిన గ్రామస్తులు సొంత డబ్బులతో వనరులను సమకూర్చుకొని ఈ గ్రామానికి వంతెన నిర్మించాలని భావించారు. ఈ క్రమంలోనే కలప తదితర వనరుల సహాయంతో గ్రామానికి వంతెన నిర్మించుకున్నారు. ఇప్పుడు వర్షాలు పడిన కూడా ఈ వంతెన సహాయంతో బయటకు వెళ్లవచ్చని గ్రామస్తులు తెలిపారు. రైతులే స్వయంగా సొంత డబ్బులతో నిర్మించుకున్న ఈ వంతెన గురించి వార్తలు రావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు, WODC చైర్మన్ అసిత్ త్రిపాఠి స్పందించారు. ఈ చెక్క వంతెన తాత్కాలికమైన దేనని త్వరలోనే ఈ నీటి ప్రవాహం పై శాశ్వత వంతెనను నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine