News

విరాట్ కిసాన్ మేళా: చెరుకు విత్తనాల లభ్యత పెంచే దిశలో ఉత్తర్ ప్రదేశ్.

KJ Staff
KJ Staff

ఉత్తర్ ప్రదేశ్, బాఘ్పాట్ లో, విరాట్ కిసాన్ మేళా ప్రారంభోత్సవానికి విచ్చేసిన, మంత్రి సూర్య ప్రతాప్ సాహి, ఆ రాష్ట్రం రైతులకు ఒక తీపి కబురు అందించారు. చెరుకు సాగుకు అవసరం అయ్యే విత్తనాలు లభ్యత పెంచేందుకు 2.25 కోట్ల రూపాయిలు కేటాయించినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో పంట వైవిధ్యం పెంచే అవసరం ఉంది అని రైతులకు సూచించారు. పూర్తి వివరాలు మీకోసం.......

మండలస్థాయి వాతావరణ వ్యవసాయ, విరాట్ కిసాన్ మేళాను, ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సూర్య ప్రతాప్ సాహి తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్లోని బాఘ్పాటు లో, ఈ మేళా మూడు రోజుల పాటు జరగనుంది. ఈ మేళా ద్వారా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, రైతుల కోసం ప్రవేశ పెట్టిన గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, వారికీ అందుబాటులో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రాల గురించి, తెలియచేయనున్నారు. ఈ మేళాకు పెద్దఎత్తున రైతులు, హాజరుకావడం విశేషం. సుమారు 2000 మంది రైతులు, వివిధ వ్యవసాయ ఉత్పత్తిదారులు, ఈ మేళా లో పాలుపంచుకున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ భారత దేశ వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది అని మంత్రి సూర్య ప్రతాప్ సాహి అన్నారు. ఈ సందర్భంలో అయన మాట్లాడుతూ, వ్యవసాయం కోసం కేటాయించే రాష్ట్ర బడ్జెట్ను 110% పెంచినట్టు తెలిపారు. పెరిగిన ఈ బడ్జెట్ కేటాయింపు వల్ల ఎంతో మంది రైతులు లబ్ది పొందబోతున్నారు. రైతులు సోలార్ పుంపులు, వ్యవసాయ ఉపకరణాలు లబ్యత పెంచేందుకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతులకి అందించే పథకాలు అన్ని తమ ప్రభుత్వం సమర్ధవంతంగా అందజేస్తుంది అని మంత్రి హర్షం వ్యక్తం చేసారు.

వ్యవసాయ వైవిధ్యం అత్యవసరం:

ఉత్తర్ ప్రదేశ్, చెరుకు ఉత్పత్తిలో, అతి పెద్ద ప్రాంతాన్ని కలిగి ఉంది. ఉత్తర్ ప్రదేశ్ ను షుగర్ బౌల్ అఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ ఆ రాష్ట్రంలోని రైతులు కేవలం చెరుకు సాగుకే కాకా మిగిలిన పంటల సాగు పై కూడా మొగ్గు చూపాలి అని మంత్రి తెలిపారు. చేరుకుతో పాటు, ధాన్యం, పప్పు దినుసులు, కూరగాయలు, పూల మొక్కల సాగు, సమగ్ర వ్యవసాయానికి అధిక పోషణకు ఆవశ్యకం అని మంత్రి ప్రస్తావించారు. పెరుగుతున్న చెక్కర వినియోగంతో దుష్ప్రభావాలు ఉన్నందు వల్ల చెక్కర వినియోగం తాగించాలి అని అయన హితవు పలికారు. హైబ్రిడ్ మొక్కలను, సబ్సిడీ లో పొందేందుకు, ఖేక్ర బ్లాక్లో ఒక నర్సరీ అందుబాటులో ఉందని, రైతులు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని సూచించారు.

Share your comments

Subscribe Magazine