వేసవి కాలం కావడంతో దేశంలో నీటి కష్టాలు రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. చాల ప్రాంతాల్లోని ప్రజలు కనీస అవసరాలకు నీరు అందక తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. ఇంక పశు పోషకులకు, వ్యవసాయదారులకు, ఈ నీటి ఇబ్బందులు చుక్కెదురుగా మారాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం లభించేది ఎప్పుడు అనే ప్రశ్న తలెత్తుతుంది.
తీవ్రమైన నీటి కష్టాలంటే ఎలా ఉంటాయో గత నేల బెంగుళూరు వాసులను చూస్తే తెలిసింది. బెంగళూరు నగర ప్రజలకు కనీస అవసరాలకు నీరు దొరక్క ఎన్ని కష్టాలు పడ్డారో వార్తల్లోనూ, సోషల్ మీడియా లో చూపించటం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కురిసిన వర్షలకు అక్కడ నీటి సమస్యలు కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. కాకపోతే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ప్రభలంకాకుండా ఉండేందుకు ప్రభుత్వం మరియు ప్రజలు కలసికట్టుగా పనిచేస్తే అది సాధ్యపడుతుంది.
బెంగుళూరు వంటి నీటి సమస్యలు ఎదురుకుంటున్న జాబితాలోకి ఇప్పుడు భారత దేశంలోని మూడు ప్రధాన నగరాలు చేరాయి. కోయంబత్తూర్, జైపూర్, మేఘాలయ వంటి ప్రాంతాల్లో నీటి కొరత అధికంగా ఉంది. రోజురోజుకి ముదురుతున్న ఎండలు, వేడి గాలులు నీటి కొరతకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రధాన రిసర్వోయార్ లలో నీటి శాతం అడుగంటుంది. దీని కారణంగా ప్రభుత్వానికి, ప్రజల అవసరాలకు నీటిని అందించడం కష్టతరంగా మారుతుంది. కోయంబత్తూరులో నీటి సమస్యలు ప్రాంతాల్లో రోజుకు ఒకసారి నీటిని సరఫరా చెయ్యాలని కోయంబత్తూర్ నగర మునిసిపల్ కొర్పొరేషన్ నిర్ణయించింది. ప్రజలు నీటి వృథాను తగ్గించి పొదుపుగా వాడుకోవాలని సూచించింది.
దేశంలోనే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాష్ట్రం రాజస్థాన్. ప్రతిరోజు సరాసరి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది దీనితో హీట్ వేవ్ పరిస్థితులు కూడా తీవ్రమవుతున్నాయి. వచ్చే వారంలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉండే పరిస్థితి ఉందని ఐఎండి హెచ్చరికలు జారీచేసింది. రాజస్థాన్ లోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు మరియు ప్రభుత్వాలు స్పందించిన తక్షణ చర్యలు పాటించకపోతే భవిష్యత్తులో సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. నీటిని పొదుపుచేస్తూ, వృథాను తగ్గించగలిగితే నీటి కొరత పరిస్థితిని నియంత్రించే వీలుంటుంది.
Share your comments