తెలుగు రాష్ట్రాల్లో చాల చోట్ల కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం కాస్త చల్లబడిందని చెప్పవచ్చు. ఏప్రిల్ నెల మొదటి నుండి ఎండలు విపరీతంగా ఉండటం వలన ప్రజలు ఇళ్ల నుండి బయటకు కాలు పెట్టాలంటే ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమయంలో వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తుంటే, చల్లబడిన వాతావరణంతో ప్రజలు ఉపిరిపీల్చుకుంటున్నారు.
ఇప్పటి వరకు, ఎండలు, వేడి ఉష్ణోగ్రత, వడ దెబ్బ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కరి అవుతున్న ప్రజలకు, వర్షాలు కురుస్తాయని ఐఎండి తీపికబురు అందించింది. ఒక మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోపక్క జనసంచారం అధికంగా ఉన్న హైదరాబాద్ లో కూడా ఈదురు గాలులతో పాటు, మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. హైదరాబాద్ తో పాటు, రంగరెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ , మంచిర్యాల, నల్గొండ, ఖమ్మం, జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తమిళనాడు ప్రాంతంలో ద్రోణి ఏర్పడి కొనసాగుతున్నందున, కోస్తాంధ్ర, రాయలసీమ, ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు తో కూడిన వర్షం కురవనుంది. గంటకు సుమారు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఇంకా కొన్ని చోట్ల ధాన్యం కోతలు కొనసాగుతన్నాయి, వర్ష సూచనా ఉన్నందున రైతులు జాగ్రత్త వహించాలి. ధాన్యాన్ని ఆరుబయట ఎంబెట్టిన రైతులు, ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు పాటించాలి.
Share your comments