News

కేసీసీ గురించి తెలుసుకోండి.

KJ Staff
KJ Staff
Benefits For Farmers
Benefits For Farmers

కిసాన్ క్రెడిట్ కార్డు రైతుల కోసమే ప్రత్యేకంగా అందించే ఈ కార్డును తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీన్ని 1998 ఆగస్టులో ప్రారంభించారు.

భారత్ లోని అన్ని నేషనల్ బ్యాంకుల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ ని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్ మెంట్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఆర్. వి గుప్తా కమిటీ రైతుల సంక్షేమం కోసం వారి అవసరాలను తీర్చేలా రుణాలను అందించేందుకు ఇలాంటివి ఏర్పాటు చేయాలని అందించిన రికమండేషన్స్ ప్రకారం వీటిని ప్రారంభించారు.

దేశంలోని రైతులందరికీ తక్కువ వడ్డీలకే రుణాలను అందించేందుకు భారత ప్రభుత్వం ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రారంభించింది. రైతుల సంక్షేమం, వ్యవసాయ రుణాలపై ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కమిటీ ఇచ్చిన సూచనల మేరకు వీటిని ప్రారంభించారు. ఇందులో వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. దీని ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలను అందజేస్తారు. వీటిలో భాగంగా తక్కువ వడ్డీతో వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల కోసం రైతులకు రుణాలను అందజేస్తారు. తక్కువ కాలానికి చెందిన రుణాలను అందించేందుకు ఈ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ని ప్రారంభించారు. దీని ద్వారా రుణాలను పొందడం కూడా చాలా సులభం. తక్కువ వడ్డీకే అందిస్తున్న ఈ కార్డుల కోసం అప్లై చేసే పద్ధతిని కూడా రైతుల కోసం చాలా సులభంగా మార్చింది ప్రభుత్వం. వీటివల్ల ఎన్నెన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..

Farmer
Farmer

1. రుణాలు అందించడం చాలా సులువుగా జరుగుతుంది. తిరిగి చెల్లించే ప్రక్రియ కూడా చాలా సింపుల్ గా ఇబ్బంది లేని వాయిదాల్లో చెల్లించే వీలుంటుంది.

2. అన్ని రకాల వ్యవసాయ సంబంధిత అవసరాలకు ఒకే కార్డుతో రుణాల మంజూరు.. టర్మ్ లోన్లు కూడా అందించే అవకాశం.

3. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు తగిన సహాయం అందజేయడం.. డీలర్లు, వ్యాపారుల వద్ద కార్డ్ ట్రాన్షాక్షన్లతో డిస్కౌంట్లు కూడా పొందే అవకాశం.

4. మూడు సంవత్సరాల వరకు రుణాలు తిరిగి చెల్లించే అవకాశం. పంట సీజన్ పూర్తయిన తర్వాతే రీపేమెంట్ చేసే వీలును కల్పించడం.

5. చాలా తక్కువ డాక్యుమెంటేషన్.. ఫండ్స్ విత్ డ్రా చేసుకునేందుకు చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ.

ఫండ్స్ దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా సులువుగా విత్ డ్రా చేసుకోగలిగే అవకాశం.

https://telugu.krishijagran.com/news/comprehensive-information-is-available-on-this-agriculture-website/

https://telugu.krishijagran.com/news/four-days-rain-alert-for-telugu-states/

Share your comments

Subscribe Magazine

More on News

More