దేశంలో గత 80 రోజులుగా ఈరోజుతోని కలుపుకొని 81 రోజులుగా భారతదేశంలో ఎక్కడ విన్న ఒకటి హాట్ టాపిక్ మణిపూర్ అల్లర్లు . అసలు మణిపూర్ గొడవేంటి ? అల్లర్లకు దారి తీసిన అంశాలేంటి ? ఈ వివాదం గురించి పూర్తిగా ఈ కథనంలో తెలుసుకుందాం .
మణిపూర్ ఇది భారతదేశ ఈశాన్యంలో బాంగ్లాదేశ్ , నాగాలాండ్ ,త్రిపుర రాష్ట్రాలను సరిహద్దులుగ కలిగిన ఒక చిన్న రాష్ట్రము . విస్తీర్ణం పరంగా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పోలితే 4 వంతు ఉంటుంది. రాష్ట్రము మొత్తం జనాభా 32 లక్షలు ఈ రాష్ట్రంలో ప్రధానంగా మూడు తెగల వారు నివసిస్తున్నారు మైథి , కుకి , నాగ వీటిలో 53 శాతం మైథి జనాభా ఉండగా కుకి , నాగలు 43 శాతం వున్నారు మైథి లలో అధిక శాతం హిందువులుగా , కుకి లు అధికశాతం క్రిస్టియన్స్ గ వున్నారు .
అసలు గొడవ దేనికి ?
మైతై సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చేందుకు ఇటీవల మణిపూర్ అసెంబ్లీ బిల్లును ప్రవేశపెట్టింది . దీనితో ST జాబితాలో ఉన్న కుకీ ,నాగ తెగలకు చెందిన గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి . ఈ ఆందోళనలు కాస్త మే 3 న అల్లర్లుగా మారాయి వాస్తవానికి మణిపూర్ లో 53శాతం మైతై వర్గానికి చెందినవారే ఉన్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పర్వత ప్రాంతాల్లో నివశించేందుకు కూడా మైతై వర్గానికి అనుమతి లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా వారికి ఎస్టీ రిజర్వేషన్లు కట్టబెట్టడం సరికాదంటూ గిరిజనులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..
మహిళను వివస్త్రను చేసి ఊరేగించి అత్యాచారం చేసిన ఘటనకు కారణాలేంటి ?
తాజాగా మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగ ఊరేగించి అనంతరం అత్యాచారం చేసిన వీడియో దేశంలో ప్రతి ఒక్కరిని కలిచి వేసింది.
ఈ ఘటన రాజధాని ఇంపాల్ నగరానికి 35 కిలో మీటర్ల దూరంలో కాంగోపీకి జిల్లాలో జరిగింది. అయితే ఈఘటన జరగడానికి ప్రధానకారణం ఒక వైరల్ వీడియో అని పోలీసుల నిర్దారణలో తేలింది . మే 4 న మైథి వర్గానికి చెందిన మహిళపై అత్యాచారం జరిగిందని ఒక వీడియో వైరల్ అయ్యింది దీనితో మైటీలు కుకీ వర్గం మహిళలపై దాడికి దిగారు ఆలా ఆ ఘటన మే 4 న జరుగగా అలసయంగా వెలుగులోకి వచ్చింది.
Share your comments