రైతులకు చేయుతగా నిలిచేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గతంలో 5 ఎకరాలలోపు పొలం ఉన్నవారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేశారు. కానీ 5 ఎకరాలపైన పోలం ఉన్నవారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు.
కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పేర్ల మీద పోలం ఉన్నా.. అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏడాది మూడు విడతలుగా రూ.6 వేలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 7 విడతల నగదును రైతుల ఖాతాల్లో జమ చేయగా.. 8వ విడత డబ్బులను ఈ నెల 20 నుంచి 25 మధ్య జమ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అయితే అన్ని అర్హతలుండి అప్లై చేసుకున్నా పీఎం కిసాన్ డబ్బులు రాలేదని చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ పథకం అర్హతలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఇలాంటి వారికి పీఎం కిసాన్ వర్తించదు
-సాగు చేసే పొలం మన పేరు మీదే ఉండాలి
-ఇంట్లో తండ్రి, తల్లి పేరుపై ఉంటే డబ్బులు రావు
-కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు
-భూమిని సాగుకు కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించినా డబ్బులు రావు
-ఇంట్లో నెలకు రూ.10 వేలు పైన పెన్షన్ పొందేవారు ఉంటే డబ్బులు రావు
-ఇక రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఏవైనా తప్పులు ఉంటే డబ్బులు రావు
-ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్ల, సీఏలు, వారి కుటుంబసభ్యులకు ఈ పథకం వర్తించదు.
పైన చెప్పిన వాటిని గమనించి ఈ పథకానికి అర్హులో.. కాదో తెలుసుకుని అప్లై చేసుకుండి. మీకు అన్ని అర్హతలు ఉంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకం డబ్బులు వస్తాయి.
Share your comments