టమాటా దీనికి మరోపేరు కిచెన్ కింగ్ భారతీయ వంటకాలలో టమాటో ది ప్రత్యేక స్థానం, సామాన్య మధ్య తరగతి కుటుంబాలలో అయితే టమాటో లేనిదే వంట ఉండదు అంటే అతిశయోక్తి కాదు ఇంతటి ప్రాధాన్యత కల్గిన టమాటో ధరలు ఎందుకు ఇంతగా పెరిగాయి ? ధర పెరగడానికి గల కారణాలు ఏమిటి ? ధరలు ఎప్పుడు తగ్గే అవకాశాలు ఉన్నాయి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా టమాటో ధర కనిష్టంగా 10 రూపాయలనుంచి గరిష్టంగా 40 రూపాయల మధ్య ఉంటుంది గత రెండు వారాల క్రితం మార్కెట్లో టమాటో ధర ఒక్కసారిగా 100 కు చేరింది అయితే ఇదేమి టమాటో రికార్డు ధర కాదు 2017 సంవత్సరంలో టమాటో ధర ఏకంగా 470 కిలో పలికింది . ప్రతి సంవత్సరంలో ఎదో ఒక దశలో టమాటో ధరలు పెరుగుతాయి .. ఇలా ఒక్కసారిగా టమాటో ధరలు పెరగడానికి గల కారణాలేంటి ?
మార్చి -ఏప్రిల్ నెలలో ఒకసారిగ పెరిగిన ఉష్ణోగ్రతలు, అప్పటికే ధర తక్కువగా ఉండడం తో సాగు చేసింది కొద్దీ శాతం రైతులు మాత్రమే అందులోను చీడ -పీడల దాడి ,పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పంట దెబ్బతినడంతో ఒక్కసారిగా ఉత్పత్తి కొరత ఏర్పడి మార్కెట్లో టమాటో ధర భారీగా పెరిగింది.
వాస్తవానికి తెలంగాలలో టమాట దాదాపు 70 వేల ఎకరాలలో 7.5 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది .. వాస్తవానికి రాష్ట్ర అవసరాలకు 5. 3 లక్షల టన్నులు ఉత్పత్తి సరిపోతుంది. దీనిని బట్టి చూస్తే రైతులు పంటను ఒకేసారి ఎక్కవగా సాగుచేస్తున్నారు మిగిలిన సమయాల్లో పంట సాగు అవ్వకపోవడంతో ఉత్పత్తి తగ్గి సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక ,మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవడంతో సాధారణ సమయాలలో కూడా ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి . ఒక్క టమాటో మినహాయిస్తే మిగిలిన కూరగాలా సాగు అవసరంకంటే సగమే సాగవుతున్నాయి .
స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీ.. ఒక వ్యాపారి వినూత్న ఆలోచన..
టమాటో ధర ఎప్పుడు తగ్గుతుంది ?
ఖరీఫ్ సీజనులో సాగు చేసిన టమాటో మొక్కలు ఇప్పటికి ఎదిగే దశలో వున్నాయి .. ఒకవేళ భారీ వర్షాలు పంట నష్టం కల్గించేకుంటే ఆగస్టు చివరి వారంలో ఒక్క సరిగా టమాటో ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని లేదంటే సెప్టెంబర్ వరకు ధరలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీ.. ఒక వ్యాపారి వినూత్న ఆలోచన..
Share your comments