News

స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీ.. ఒక వ్యాపారి వినూత్న ఆలోచన..

Gokavarapu siva
Gokavarapu siva

పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.. ఒక వైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలు మరోవైపు పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్యు ప్రజలు కొనలేని విధంగా పెరిగిపోతున్నాయి టమాటో అయితే ఏకంగా కిలో చికన్ ధరతో పోటీపడుతోంది రానున్న రోజులలో కిలో టమాటో 300 రూపాయలకు చేరుకున్న ఆశ్చర్యపొన్నకర్లేదు .

దేశంలోనే, టమోటాలు ఇప్పుడు అధిక రేటుకు విక్రయిస్తున్నారు, మార్కెట్లో టమాటా ధరలు కనిష్టంగా రూ. 100 నుండి గరిష్టంగా రూ. 250 వరకు ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో టమాట ధర రూ.90 నుంచి రూ.130 వరకు ఉంది. బెంగళూరులో కిలో రూ.101 నుంచి రూ.130 వరకు ఉండగా, కోల్‌కతాలో రూ.150గా ఉంది. అదే విధంగా ఢిల్లీ, ముంబైలలో కిలో రూ.120 పలుకుతోంది.

టొమాటో ధరలు గణనీయంగా పెరగడంతో రెస్టారెంట్లు టమాటా వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి మీడియా నివేదికల ప్రకారం, ప్రఖ్యాత ఫుడ్ కార్పొరేషన్, మెక్‌డొనాల్డ్స్, వారి మెను నుండి టమోటాలను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా రేట్లు పెరగడానికి గల కారణం ఏమిటంటే టొమాటో యొక్క దిగుబడి గమణియంగా తగ్గిపోవడమే అని చెప్పవచ్చు. మార్కెట్లో ఈ ధరలు ఇంకా ఒక నెలరోజులపాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర ప్రారంభం.. వెయిటింగ్ లో ఫ్యాన్స్..

మొబైల్స్ వ్యాపారానికి చెందిన ఒక వ్యాపారి ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చాడు. తమ సెల్ ఫోన్ షాపులో ఎవరైన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే వారికి 2 కిలోల టమోటాలను ఉచితంగా ఇస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ మొబైల్ షోరూమ్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్‌లకు 2 కిలోల టమాటాలను బహుమతిగా అందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే 2 కిలోల టమాటాలు బహుమతిగా ఇస్తున్నట్లు మొబైల్ దుకాణదారుడు అభిషేక్ అగర్వాల్ చెప్పారు.

ఈ పథకం ప్రారంభించిన వెంటనే కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని, దీని కారణంగా, మేము ఎక్కువ మొబైల్‌లను విక్రయిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో, టమాటాలు ఉచితంగా అందించడంతో కస్టమర్లు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పారు.

ఇటీవలి కాలంలో టమాటా ధరలు గణనీయంగా పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పథకం అమలు తర్వాత కస్టమర్ల సంఖ్య వేగంగా పెరగడం మరియు మొబైల్ ఫోన్ అమ్మకాలు పెరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదనంగా, కాంప్లిమెంటరీ టొమాటోలను అందించడం పట్ల కస్టమర్‌లు కూడా చాలా సంతృప్తి చెందారని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..

పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్ర ప్రారంభం.. వెయిటింగ్ లో ఫ్యాన్స్..

Related Topics

mobile phone free tomatoes

Share your comments

Subscribe Magazine