పర్యావరణ పరిరక్షణ మీద అవగాహనా కల్పించేందుకు, మనం ప్రపంచ ధరిత్రి దినోత్సవాని జరుపుకుంటాము. ఈ భూమి అన్ని జీవరాశులకు సొంతం. భూమిమీద పుట్టిన ఏ జీవం శాశ్వతం కాదు. పర్యావరణాన్ని సంరక్షించవల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
పర్యావరణాన్ని పరిరక్షించవల్సిన బాధ్యత మన మీద ఉంది, ఈ విషయాన్ని మనందరికీ గుర్తుచెయ్యడానికి ప్రతి ఏడాది ఏప్రిల్ 22 న వరల్డ్ ఎర్త్ డే(ధరిత్రి దినోత్సవం) నిర్వహిస్తారు. ఈ రోజునే మథర్ ఎర్త్ డే గా కూడా పరిగణిస్తున్నారు. మన భూమి మీద పుట్టే ప్రతీ ప్రాణి సందర్శకులు మాత్రమే, ఎవరు శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఆధిపత్యం సంధించాలకున్న మనిషి మాత్రం భూమిని నాశనం చేస్తున్నాడు. మనిషి విచక్షణ రహితంగా చేస్తున్న పనుల మూలాన వాతావరణ సమాత్యులత దెబ్బతింది, దీనికి ఫలితంగా కొన్ని సందర్భాల్లో ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. పర్యావరణాన్ని మనం కాపాడితే అది తిరిగి మనల్ని పరిరక్షిస్తుంది. ప్రకృతికి హాని కలిగించే అనేక కార్యాకలాపాలను వెంటనే నిషేధించవల్సిన అవసరం ఉంది. ఈ హానికారక చర్యలు కొనసాగినట్లైతే, భవిష్యత్తు తరాల జీవనం అస్తవ్యవస్థం అవుతుంది. భూమి మీద మనిషి మనుగడకు ప్రశార్ధకంగా మారే అవకాశం ఉంటుంది.
ఈ సమస్యలన్నిటికీ నియంత్రించడానికి భూమిని, పర్యావరణనాన్ని మరోయు ఇతర జీవరాశులను పరిరక్షించడమే మనకున్న ఏకైక మార్గం. భూమి మీద అతిముఖ్యమైన గాలి, నీరు, నేల, అడవులు, ఇతర జీవరాశులు, అన్నిటికి సమాత్యులత ఏర్పరచడం మనుషుల ముందున్న అతి పెద్ద లక్ష్యం. వీటన్నిటి విశిష్టతను తెలియపరచడానికి, ప్రతి ఏడాది వరల్డ్ ఎర్త్ డే జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం ధరిత్రి దినోత్సవానికి ఒక లక్ష్యం లేదా థీమ్ ను నిర్దేశిస్తారు. ఈ ఏడాది థీమ్ ప్లాస్టిక్ వెర్సెస్ ప్లానెట్. భూమికి ప్లాస్టిక్ కాలుష్యం అతి పెద్ద సమస్యగా మారుతుంది, కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ పర్యావరణానికి మరియు అనేక జంతువులకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు 2040 నాటికల్లా ప్లాస్టిక్ వినియోగాన్ని 60% కుదించేందుకు మార్గదర్శకాలను సూచిస్తున్నారు.
నేడు పర్యావరణ పరిరక్షణే ముఖ్య ఉదేశ్యంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రపంచంలోని అనేక చోట్ల రోడ్ షోలు, మరియు ఇతర కార్యాక్రమాల్లో ప్రజలు పాలుపంచుకుని, భూమి యొక్క విశిష్టతను ప్రతిఒక్కరికి తెలియపరుస్తారు. పర్యావరణాన్ని రక్షించవల్సిన భాద్యత మనందరి మీద ఉంది. మన దైనందన జీవితంలో చేస్తున్న కొన్ని తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ముందుగా నీటి వృదాను తగ్గించాలి, ఆహార వృధాను అరికట్టాలి. మట్టిని కాపాడుకోవాల్సిన భాద్యత ప్రభుత్వం మీద మరియు రైతుల మీద ఉంది. రసాయన మందుల వినియోగాన్ని అరికట్టాలి. మనమంతా కలిసికట్టుగా పనిచేసి భూమిని భూమిని కాపాడుకోవాలి.
Share your comments