News

ఇవి హెల్త్ డ్రింక్స్ కావు... అన్-హెల్తి డ్రింక్స్....

KJ Staff
KJ Staff

తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. బార్నోవిటతో సహా పలు కొన్ని ఇతర హెల్తి డ్రింక్ పౌడర్లు ఉత్పత్తి చేసే కంపినీలకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది, ఈ ఆదేశాల ప్రకారం, ఇప్పటివరకు ఎనర్జీ డ్రింక్స్ పేరుతో చలామణి అవుతున్న కొన్ని హెల్తి డ్రింక్స్ నిజానికి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సూపర్ మార్కెట్లలో ఎనర్జీ డ్రింక్స్ అన్న పేరుతో చాల కంపెనీలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచుతారు, ప్రజలు కూడా టీవీ యాడ్స్ లో చూసే ప్రకటనలు నిజం అన్ని నమ్మి వాటిని కొంటారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ శాతం పిల్లల కోసమే తయారుచెయ్యబడుతున్నాయి. కానీ ఇవి నిజంగానే పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయా అన్న ఆలోచన తల్లితండ్రులు చెయ్యవలసి ఉంటుంది. ఈ బ్రాండ్స్ అన్ని నిర్ధేశించిన దాని కంటే అధిక చెక్కరను, తమ ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నాయి. చక్కర తినడం ద్వారా శరీరానికి వెంటనే శక్తీ లభిస్తుంది, కానీ దీర్ఘకాలికంగా చెక్కెర శరీరంపై ఎన్నో దుష్ప్రభావాలను చూపుతుంది. చక్కెర అధికంగా తినేవారిలో, షుగర్, ఊబకాయం వచ్చే అవకాశం ఉంది మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువ మొత్తంలో చెక్కర తీసుకోవడం వల్ల, చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది.

భారత పిల్లల హక్కుల రక్షణ కమిషన్, నివేదిక ప్రకారం ఎఫ్ఎస్ఎస్ఏఏ(FSSAI) యాక్ట్ 2006 ప్రకారం, బోర్నవిటా బ్రాండ్ నడిపే మాండెలెజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జారీచేసిన నిబంధనల్లో ఎక్కడ తమ బ్రాండ్ హెల్త్ డ్రింక్ అని పేర్కొన్నట్టు లేదని తెలియచేసింది. దీని ప్రకారం ఈ బ్రాండ్ ప్రచారం చేస్తున్న యాడ్స్ అన్ని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అంతే కాకుండా బోర్నవిటా నిర్ణిత మోతాదుకు మించి చెక్కర ఉపయోగిస్తు, దానిని హెల్త్ డ్రింక్ అన్న పేరుతొ అమ్ముతున్నట్లు, జాతీయ పిలల్ల హక్కుల రక్షణ కమిషన్ అధ్యక్షుడు ప్రియాంక కనుంగొ తెలియచేసారు. మిగిలిన బ్రాండ్లు కూడా ఇదే తరహాలో, పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉత్పత్తులను ఎనర్జీ డ్రింక్స్ అన్న పేరుతో మార్కెట్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

సాధారణంగా మార్కెట్లో దొరికే ఉత్పత్తుల్లో వాటిలో లభించే చెక్కెర ఆధారంగా విభజిస్తారు. 100 గ్రాముల ఆహారంలో 10 గ్రాముల కంటే ఎక్కువ చెక్కెర ఉంటె వాటిని హై షుగర్ ఫుడ్స్ గా పరిగణిస్తారు. మనం తీసుకునే ఆహారంలో 10 గ్రాములు అంతకంటే తక్కువ చక్కర శాతం ఉండేలా చూసుకోవడం మంచిది, 5 గ్రాముల కంటే తక్కువ చెక్కర ఉన్న ఆహారాన్ని లో-షుగర్ ఫుడ్స్ గా పరిగణిస్తారు. 100 గ్రాముల ఆహారంలో 0.5% కంటే తక్కువ ఉంటె దానిని షుగర్ ఫ్రీగా పిలుస్తారు. వినియోగ దారులు జాగృతం చెంది తమ ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. కేవలం ప్యాక్ పైన బాగానే కాకూండా వెనకాల ఉండే ఫుడ్ లేబిల్ మీద కూడా ద్రుష్టి సారించాలి. మార్కెట్లో దొరికే అల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్స్ లో చెక్కెర, కొవ్వు శాతం ఎక్కువుగా ఉంటె వాటిని తినకపోవడం మంచిది.

Share your comments

Subscribe Magazine