News

world Tea Day: నేడు ప్రపంచ టీ దినోత్సవం... రోజుకు ఎన్ని కప్పులు టీ తాగాలి..

KJ Staff
KJ Staff

మనం నిత్యం సేవించే పానీయాల్లో టీ ప్రధానమైనది. టీ భారతీయుల ఫేవరెట్ డ్రింక్ గా పరిగణించబడుతుంది. ఎంతో మంది భారతీయుల రోజు మొదలయ్యేది టీ తోనే. మన దైనందన జీవితంలో టీ యొక్క విశిష్టత తెలియచేసేందుకు ఐక్యరాజ్యసమితి మే 21 న టీ దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో కూడా టీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంది. అయితే టీ లో మంచిగుణాలున్నప్పటికీ దీనిని ఎలా తాగాలి, రోజుకు ఎన్నిసార్లు తాగాలి అన్న విష్యం మనలో చాలా మందికి తెలియదు. దాని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. టీ తాగక ఉత్సహంగా మరియు శక్తివంతంగా అనిపిస్తుంది. దీనికి కారణం టీలో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ మన శరీరంలోకి ప్రవేశించగానే స్టెరాయిడ్ హార్మోన్ల శాతాన్ని పెరిగేలా చేస్తుంది, దీనితో మెదడు మరియు శరీరం ఉత్తేజం అవవుతాయి. అయితే ఈ ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది, తరువాత హార్మోన్లు వాటి యధా స్థానానికి రావడంతో మల్లి టీ తాగాలన్న ప్రేరణ కలుగుతుంది. ఈ విధంగా కొంతమంది రోజుకు లెక్కలేనన్ని సార్లు టీ తాగుతుంటారు. ఎక్కువ మొత్తంలో టీ తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. టీ ఎక్కువుగా తాగేవారు ఒకరోజుకు 300 గ్రాములకు మించి కెఫిన్ తాగకూడదు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం (ICMR), 150 మిల్లీలీటర్ల టీలో, 30-65 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. టీ పొడి ప్రమాణాన్ని బట్టి ఈ సంఖ్య మారుతూవుంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని టీ తాగడం ఉత్తమం. దీని ప్రకారం ఒక మనిషి రోజుకు 6-8 కప్పుల టీ మాత్రమే తాగాలి, ఇంతకన్నా ఎక్కువైతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

మనకి టీ అంటే పాలతో చేసిన టీ మాత్రమే గుర్తుకు వస్తుంది, కానీ మిగిలిన దేశాల్లో కేవలం టీ డికాషన్ మాత్రమే తాగుతారు. ICMR కూడా పాలతో చేసినదాని కంటే డికాషన్ టీ మాత్రమే తాగాలని సూచిస్తుంది. టీ లో కెఫిన్ తో పాటు థియోబ్రోమిన్, థియోఫెలైన్ కూడా ఉంటాయి, ఇవి రక్త ప్రసరణ సమంగా జరగడంలో మరియు గుండె ఆరోగ్యం మెరుగుపరచడం సహాయపడతాయి, అంతేకాకుండా కడుపు కాన్సర్ తగ్గించే కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే పాలలో కలిపిన టీ తాగితే ఈ ప్రయోజనాలు ఏమి లభించవు, కాబట్టి గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగడం ఉత్తమం.

Related Topics

#Tea #Tealover #WorldTeaday #ICMR

Share your comments

Subscribe Magazine

More on News

More