News

వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రారంభం .. జూన్ 7 వరకు పూర్తి !

Srikanth B
Srikanth B
వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రారంభం .. జూన్ 7 వరకు పూర్తి !
వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రారంభం .. జూన్ 7 వరకు పూర్తి !

2023-24 సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైనది .. దారిద్య రేఖ దిగువన ఉన్న కుటుంబ పెద్దకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే పోషణ భారం కుటుంబం పై పడకుండా ఉండేందుకు ఆర్థిక సాయంగా వైఎస్సార్ బీమా పథకంను వర్తింపచేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .

వైఎస్సార్ బీమా పథకాన్ని 2021 జూలై 1న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుం బాలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కాగా, 2023-24కు సంబంధించి జూలై 1 నుంచి వైఎస్సార్ బీమా పథకం అమలుకు కార్మిక శాఖ ఉత్తర్వులిచ్చింది. 18-50 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారంగా అం దజేస్తారు. అలాగే 18-70 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారు. బీమా కంపెనీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే పరిహారం చెల్లింపును ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.372 కోట్లను కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .

నేడు వైస్సార్ యాత్ర సేవాపథకం క్రింద రైతులకు ట్రాక్టర్లు ,హార్వెస్టర్ ల పంపిణి


గత నెల 29న నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 7 లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి ఆదేశించారు.

నేడు వైస్సార్ యాత్ర సేవాపథకం క్రింద రైతులకు ట్రాక్టర్లు ,హార్వెస్టర్ ల పంపిణి

Related Topics

ysr aasara

Share your comments

Subscribe Magazine

More on News

More