ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త అందించింది. ప్రభుత్వం రాష్ట్రంలోని పేదింటి ఆడపిల్లలకు పెళ్లికానుక అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధుల్ని విడుదల చేయనున్నారు.
ఇవాళ తాడేపల్లిలో ఉన్న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుండి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. మొత్తానికి ఈ సంవత్సరంలోని ఏప్రిల్- జూన్, 2023 యొక్క త్రైమాసికంలో వివాహం చేసుకున్న వివాహితులకు ఈ నగదుని ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రం అంతటా కలిపి 18,883 జంటలకు గాను రూ. 141.60 కోట్ల రూపాయలను వధువు యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
కాగా ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గడిచిన 9 నెలల్లోనే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద 35,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 267.20 కోట్ల రూపాయలు ను జగనన్న ప్రభుత్వం జమ చేసింది.
రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “వైఎస్సార్ కళ్యాణమస్తు" పథకాన్ని ప్రవేశపెట్టి, ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీలకు, దివ్యాంగులకు, నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు పెళ్ళికి ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది. మరొకవైపు ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” పథకం కింద ఈ ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఇది కూడా చదవండి..
గమనిక! ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇక ఏడు పేపర్లు.. బొత్స సత్యనారాయణ
ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలకు అర్హత పొందాలంటే వధూవరులిద్దరు కూడా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించడం కచ్చితం చేశారు. మరియు పెళ్లి జరిగే సమయానికి అమ్మాయి యొక్క వయస్సు 18 ఏళ్ళు నిండాలి మరియు అబ్బాయి యొక్క వయస్సు 21 సంవత్సరాలు దాటాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ద్వారా బాల్య వివాహాలను ఆపవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది.
ప్రజలకు ఈ రెండు పథకాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్న లేదా ఈ పథకాలు యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలన్న https//gsws-nbm.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా గురించి సూచనలు లేదా ఆందోళనలు ఉన్న వ్యక్తులు జగన్‌కు చెబుదాం కార్యక్రమంలో భాగంగా టోల్ ఫ్రీ నంబర్ 1902ను ఉపయోగించుకోవాలని అధికారులు సిఫార్సు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments