News

గమనిక! ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇక ఏడు పేపర్లు.. బొత్స సత్యనారాయణ

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నుండి రాష్ట్రంలో 10వ తరగతికి ఏడు పేపర్ల విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కాగా గతం 10వ తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లతో పబ్లిక్‌ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించేది. ఈ ఏడు పేపర్ల విధానం ఎలా ఉండబోతుందో చూడాలి.

భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం పేపర్‌ను 50 మార్కులకు మరో ప్రశ్నపత్రంగా ఇస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. ప్రస్తుతం వరకు అమలులో ఉన్న కాంపొజిట్‌ విధానాన్ని విద్యాశాఖ రద్దు చేసింది. ఇన్నాళ్లు 70/30 మార్కుల విధానంలో తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్‌, ఉర్దూ/ పార్శీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మంగళవారం విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో జరిపిన సమావేశంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన మార్పులను తెలియజేసారు. రెండు రోజులు జరిగే సామాన్యశాస్త్రం పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఇస్తారు. మిగతా అయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కొక్క పేపరే ఉంటుంది.

ఇది కూడా చదవండి..

అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలి -జిల్లా కలెక్టర్ గోపీ

దీనితోపాటు ప్రథమ బాష అయిన తెలుగు ప్రశ్నపత్రంలో మొదటి ప్రశ్నగా ఉన్న ప్రతిపదార్థం, భావాన్ని తీసేసారు. ఈ ప్రశ్నకు బదులుగా ఒక పద్యాన్ని ఇచ్చి, దానికి సంబంధించి నాలుగు ప్రశ్నలను అడుగుతారు. వీటిలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు అనగా మొత్తం 8 మార్కులను కేటాయించారు.

పురపాలక ఉపాధ్యాయులకు సర్వీసు నిబంధనలు లేనందున పెండింగ్‌లో ఉన్న వైద్య బిల్లుల గడువును పొడిగిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. పదోన్నతులు, బదిలీల కారణంగా రెండు నెలల నుంచి జీతాలు రాని ఉపాధ్యాయులకు వారంలో జీతాలు ఇప్పిస్తామన్నారు.

ఇది కూడా చదవండి..

అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలి -జిల్లా కలెక్టర్ గోపీ

Share your comments

Subscribe Magazine