News

YSR Matsyakara Bharosa: వైస్సార్ మత్స్యకార భరోసా పథకంలో సవరణలు,పథకానికి వీరు అనర్హులు:

S Vinay
S Vinay

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మత్స్యకారులకు ప్రయోజనము చేకూర్చడానికి (ysr matsyakara bharosa) వైస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని 2019 లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే, అయితే ఈ పథకంలో కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దీనికి సంబంధించి అధికారకంగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

ప్రభుత్వం తీసుకున్న సవరణలను చూసినట్లయితే వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద గతంలో రేషన్‌ కార్డుని ఆధారంగా తీసుకుని అర్హులను గుర్తించారు. తాజాగా సవరించిణ విధానాలతో రేషన్‌ కార్డుల అవసరం లేకుండానే కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటారని పేర్కొన్నారు.

పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు:
మత్స్యకారులకు నాలుగు చక్రాల వాహనం ఉంటె అనర్హులు అనే విషయం తెలిసినదే అయితే మత్స్యకారుల ఇబ్బందుల దృష్ట్యా ఇందులో మార్పులు చేస్తూ ట్రాక్టర్లు,టాక్సీలకి మినహాయింపు ఇచ్చిందది. పట్టణ ప్రాంతంలో 1,000 చదరపు అడుగుల స్థలం మించి ఉండకూడదన్న నిబంధనను సవరించి, మున్సిపల్‌ ఏరియాలో 1,000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉన్న కుటుంబానికి మాత్రమే అర్హత ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులకు నెలకు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.10,000, పట్టణ ప్రాంతంలో రూ.12,000 మించకూడదంటూ ఉన్న నిబంధనని సడలిస్తూ గ్రామీణ ప్రాంతంలో రూ.1.20లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44లక్షలుగా
ఉండేట్లు మార్పులు చేస్తూనిర్ణయం తీసుకుంది.

(ysr matsyakara bharosa scheme) వైఎస్ఆర్-మత్స్యకార భరోసా పథకం గురించి తెలుసుకుందాం

మత్స్యకారులు మెరైన్/ మంచినీటి వనరులలో చేపలు పట్టడం ద్వారా తమ జీవనోపాధిని పొందుతున్నారు. భూసంబంధ కార్యకలాపాల వలె కాకుండా, తీరప్రాంత జలాలు మరియు లోతట్టు నీటి వనరులలో చేపలు పట్టడం వలన ప్రాణనష్టం మరియు ఫిషింగ్ ఆస్తులు ఎక్కువగా ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ ప్రమాద కారకం ఎక్కువగా ఉంటుంది మరియు కుటుంబ పెద్ద/సంపాదిస్తున్న సభ్యుడు ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబాలు వారి జీవనోపాధి కోసం ప్రయత్నిస్తాయి. అందువల్ల, ప్రమాదవశాత్తు మరణాలు మరియు శాశ్వత వైకల్యాల సంఘటనల సమయంలో బాధిత కుటుంబాలకు వారి జీవనోపాధికి ఎక్స్‌గ్రేషియాతో సహాయం చేయడం.

లక్ష్యాలు:
సముద్రం/మంచి నీటి వనరులలో చేపల వేటలో ప్రమాదవశాత్తు మరణం/శాశ్వత వైకల్యం సంభవిస్తే బాధితులకు/బాధిత కుటుంబాలకు రూ.10.00 లక్షల పరిహారం చెల్లించడం.

బాధితులు/బాధిత కుటుంబాలకు వారి జీవనోపాధి కోసం జీవనోపాధి అందించడం

బాధిత కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడం

మరిన్ని చదవండి.

తీవ్ర పంట నష్టాన్ని కలుగజేస్తున్న తామర పురుగులని ఇలా నివారిద్దాం.

Share your comments

Subscribe Magazine