ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని 2019 సంవత్సరంలో ప్రారంభించిన విషయం తెలిసినదే, రైతులకి వ్యవసాయంలో ప్రాథమిక పెట్టుబడికి చేయూతని ఇవ్వడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ప్రతి సంవత్సరం వైస్సార్ రైతు భరోసా మరియు కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం కిసాన్ కింద రైతులకి రూ. 13,500/- మూడు విడతల కింద నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ అవుతాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం లో తొలి విడతని రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో రైతులకి అందించే ఏర్పాటు చేస్తోంది.అర్హులైన అందరి రైతులకి ఈ పథకం అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషికి చేస్తుంది.తొలి విడతలో రూ.7,500 . రెండో విడతలో రూ. 4 వేలు, మూడో విడతలో రూ.2 వేలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది.
ఇప్పటి వరకు లబ్ది పొందని రైతులందరికి అవకాశం:
అర్హత ఉండి ఇప్పటి వరికి లబ్ధి పొందని రైతులకి మరొక అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులు దీని కొరకై ' రైతు భరోసా' పోర్టల్‌లోని ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‘ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అనర్హులైన వారిని మరియు ప్రాణాలు కోల్పోయిన రైతులను ఈ రైతు భరోసా పథకం కింద నుండి తొలగిస్తారు.
2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.7,020 కోట్లు:(7,020 CRORES FOR RYTHU BHAROSA SCHEME)
ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.7,020 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం 2021–22లో రూ.7,016.కోట్లను కేటాయించింది 2020–21లో రూ.6,928 కోట్లు, 2019–20లో రూ.6,173 కోట్లతో రైతులకి లబ్ది చేకూర్చింది.
రైతు భరోసాకి CCRCకార్డు తప్ప్పనిసరి.(CCRC CARD MANDATORY)
రైతు భరోసా పథకం కింద లబ్ది పొందటానికి రైతులు ఖచ్చితంగా (CCRC) క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు ని తప్పనిసరిగ ఉండాలి ఇప్పటి వరకు ఈ కార్డు పొందని రైతులు CCRC పోర్టుల్ లో నమోదు చేసుకోవచ్చు.
మరిన్ని చదవండి.
Share your comments