News

మిర్చి ధరలకి రెక్కలు ఏకంగా బంగారాన్ని దాటేసాయి

S Vinay
S Vinay

మిగితా పంటలతో పోలిస్తే మిర్చి పంటని పండించడానికి కాస్త ఎక్కువ పెట్టుబడి కావాలి ఇందులో లాభాలు కూడా అలానే ఉంటాయి. మరో విధంగా చెప్పుకుంటే మిర్చి పంట స్టాక్ మార్కెట్ లాంటిది దాని ధర ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అంచనా వేయడం కాస్తా కష్టం తో కూడుకున్న పనే

ప్రస్తుతం మిర్చి ధరలకు రెక్కలు వచ్చాయి ఎంతలా అంటే పసిడి ధరని కూడా దాటేశాయి.మార్కెట్ లో పెరిగిన ఈ ధరలతో (మిర్చి రైతులు)chilli farmers చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ధరలు దేశంలోనే కొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి . బంగారం ధరలను దాటేసాయి . తులం బంగారం 50వేల రూపాయలు ఉంటే రాయలసీమలో ఒక క్వింటాల్ మిర్చి ధర రూ 52వేలకు చేరుకుంది. ఇది దేశంలోనే అత్యధికంగా నమోదు అయిన ధరగా రికార్డు కి ఎక్కింది. వరంగల్‌ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో కూడా రికార్డు ధరలు నమోదవుతున్నాయి. క్రితం వరకు క్వింటా 50 వేలు ఉన్న ధర అమాంతం 52 వేలకు చేరుకుంది. . పంటను మార్కెట్‌కు తీసుకొస్తున్న రైతులు ధరలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలం లో పత్తికి కూడా రికార్డు ధరలు నమోదు అయ్యాయి. ఖమ్మంలోని పత్తి మార్కెట్ యార్డులో క్వింటాలుకు 6,025 రూపాయల కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కు మించి పత్తికి క్వింటాలుకు ₹ 9,000 నుండి ₹ 11,500 వరకు మంచి ధర పలికింది . దేశీయ మరియు విదేశీ మార్కెట్లలో సహజ ఫైబర్కు డిమాండ్ పెరగడంతో పత్తి ధరలు విపరీతంగా పెరిగాయి. ఏది ఏమైనా మిర్చి మరియు పత్తి రైతులకి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి.

మరిన్ని చదవండి.

తెలంగాణ :ఖమ్మం మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు ధర!

Share your comments

Subscribe Magazine