తెలంగాణాకు చెందిన ఒక రైతు సంప్రదాయ పంటలు పండించకుండ వినూత్నంగా ఆలోచించి అవకాడో పంటను సాగు చేసాడు. ఈ పంట ద్వారా ఆ రైతు అధిక లాభాలను పొందుతున్నాడు. మరియు రాష్ట్రంలో ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ రైతు పేరు జైపాల్ నాయక్. ప్రస్తుతం జైపాల్ నాయక్ తన పంటను కువైట్ కు ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇతని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
రంగారెడ్డి జిల్లాకు చెందిన జైపాల్ నాయక్ అనే 30 ఏళ్ల రైతు తన పొలంలో అవకాడో సాగు చేయడం ప్రారంభించాడు. సాధారణంగా ఈ అవకాడో పండు తక్కువ ఉష్ణోగ్రతలో అనగా 38 డిగ్రీల సెల్సియస్ కన్న తక్కువ ఉండే ప్రదేశాల్లో పండుటాది. ఈ రైతు పండిస్తున్న అవకాడో అనేది తెలంగాణ రాష్ట్రంలోనే తోలి అవకాడో పంట దానితోపాటు బాంగ్లాదేశ్ నుండి ఇండియాకు ఇంపోర్ట్ చేసుకున్న మొదటి ఆస్ట్రేలియన్ అవోకాడో రకం.
జైపాల్ నాయక్, లండన్ లో ఎంబీఏ చేసాడు. అనంతరం సొంత దేశానికి వచ్చి అవకాడో పంటను సాగు చేయాలని అనుకున్నాడు. ఆ పంటకు సంబంధించి చాలా రీసెర్చ్ చేసాడు. ఆ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా తెలుసుకున్నాడు. దీనితో ఈ మొక్కలు అనేవి మహబూబ్ నగర్ కు చెందిన జె కృష్ణారెడ్డి వద్ద ఉన్నట్లు తెలుసుకున్నాడు. తాను అవకాడో పండించాలని అనుకున్నట్లు చెప్పాడు. అందుకోసం మొక్కలు కావాలని అడగగానే ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
ఇది కూడా చదవండి..
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. అదేమిటంటే?
కృష్ణారెడ్డి వద్ద 200 మొక్కలు కొనుగోలు తన సొంత భూమిలో సాగు చేయడం ప్రారంభించాడు. గడిచిన మూడేళ్ళలోనే జైపాల్ నాయక్ తన మొదటి పంటను అందుకున్నాడు. ఈ మొదటి పంట నుండి సుమారుగా 600 క్వింటాళ్ల దిగుబడిని పొందాడు. అక్కడి చుట్టుప్రక్కల ప్రజలే ఈ పండు రుచిని చూడటానికి భారీగా అవకాడోలను కొన్నారు. మొత్తం పంటను కేవలం మూడు రోజుల్లోనే విక్రయించాడు.
అతనికి 4 లక్షల రూపాయల లాభం వచ్చింది. ఆ రైతు మాట్లాడుతూ, సరైన పద్ధతిలో పంటను సాగు చేస్తే మంచి దిగుబడిని పొందవచ్చని అంటున్నాడు. ఓ ఎగుమతి సంస్థ కువైట్ కు పండ్లను ఎగుమతి జైపాల్ నాయక్ ను సంప్రదించారట. ఇప్పుడు చేతికి రాబోయే పంటను కువైట్ కు ఎగుమతి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఈ పంటను సాగు చేయడానికి ఆ రైతుకు రూ.1.4 లక్షల వరకు ఖర్చు అయ్యింది. మార్కెట్ లో కూడా ఈ పండ్లను ఎక్కువ ధరకే అమ్ముతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments