Success Story

రైతులు సక్సెస్.. వైట్ మస్లీ సాగుతో అధిక లాభాలు.

KJ Staff
KJ Staff
white musli
white musli

వ్యవసాయాన్ని చాలామంది చులకనగా చూస్తారు. వ్యవసాయమా అని తేలికగా తిసిపారేస్తారు. కానీ వ్యవసాయం చేయడం చాలా కష్టమైన పని. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి చాలా అవుతుంది. డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. చిన్న, సన్నకారు రైతులు అప్పుడు తెచ్చి మరీ వ్యవసాయం చేస్తుంటారు. ట్రాక్టర్, విత్తనాలు, కూలీలు, రసాయనాలు, ఎరువులు ఖర్చులు బోల్డెంత అవుతాయి. ఇక ఎండ, వాన, చిలి అనక కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఇంత కష్టపడి పనిచేసినా.. ఆకాల వర్షాలు, పరుగులు, తెగులు పడితే పంట నాశనమై పెట్టుబడి పెట్టుబడి కూడా మిగలదు. చివరికి అప్పులే మిగులుతాయి.

కానీ లాభదాయకమైన పంటలు సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చు. చాలామంది రైతులు లాభదాయకమైన పంటలు పండిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అలాంటి పంటల్లో వైట్ మస్లీ ఒకటి. దీన్ని సఫేద్ మస్లీ అని కూడా అంటారు. ఇవి వనమూలికలు. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయజనాలు ఉన్నాయి. డయాబెటిస్ ఆదుపులో ఉంచడానికి, బరువు తగ్గేందుకు, అంగ స్తంభన సమస్యకు వీటిని ఉపయోగిస్తారు. ఆన్ లైన్ లో కూడా ఇవి లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కాకుండా దేశంలోనూ వీటికి మంచి డిమాండ్ ఉంది. టానిక్ రూపంలో కూడా ఇది ఆన్ లైన్ లో లభిస్తుంది.

ఈ లాభదాయకమైన పంటను పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు గుజరాత్‌లోని దాంగ్ జిల్లాలోని భవాడీ గ్రామ రైతులు. ఆర్గానిక్ పద్దతిలో వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. వర్షాకాలంలో ఈ పంటను పండిస్తారు. ప్రస్తుతం కేజీ వైట్ మస్లీ ధర రూ.1000 నుండి రూ.1500 ధర పలుకుతుంది. స్థానిక ప్రభుత్వం కూడా వీరిని ప్రోత్సహిస్తుంది. స్థానిక షాపుల యజమానులు, ఫార్మా కంపెనీలు నేరుగా రైతుల దగ్గరికి వెళ్లి పంటను కొనుగోలు చేస్తున్నాయి. ఇక రైతులు ఈ కామర్స్ వెబ్ సైట్లలో పెట్టి పంటలను విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. దాంగ్ జిల్లాలో 350 మంది రైతులు 40 ఎకరాల్లో ఈ పంటలను సాగు చేస్తున్నారు.

అధిక దిగుబడి సాధిస్తూ దాంగ్ జిల్లా రైతులు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మూలికలను వాడటం ద్వారా అక్కడి రైతులు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. గ్రామంలోని జయేష్ భాయ్ మొకాసీ మొదటిసారి ఈ సాగు చేపట్టారు. ఆ తర్వాత మిగతా రైతులంతా దీన్నే సాగుచేయడం మొదలుపెట్టారు. దాంగ్‌లో వైట్ మస్లీతోపాటూ... కడ్వీ మస్లీని కూడా సాగుచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు కూడా వీటిని చేయూత అందిస్తున్నాయి. ప్రభుత్వం కూడా వైట్ మస్లీతో తయారుచేసిన ఆయుర్వేద మందులను ఆయుర్వేద షాపులకు సరఫరా చేస్తోంది.

దాంగ్ ఫారెస్ట్ విభాగం కూడా ఈ పంటను ఎంకరేజ్ చేస్తుంది. ఫారెస్ట్ విభాగమే రైతులకు విత్తనాలు సరఫరా చేస్తుంది. వైట్ మస్లీలో చాలా ఔషధ గుణాలు ఉంటాయని, తాము కూడా ఇవే తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నామని ఇక్కడి రైతులు చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More