Success Story

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి వ్యవసాయం వైపు.. హైడ్రోపోనిక్స్ సేద్యంలో

KJ Staff
KJ Staff

ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే యువతకు క్రేజ్. సాఫ్ట్ వేర్ జాబ్ వచ్చిందంటే చాలు.. యువత గంతులేస్తుంది. సాఫ్ట్ వేర్ జాబ్ సాధించేందుకు లక్షల రూపాయలు దారపోసి కోచింగ్‌లు మీద కోచింగ్‌లు తీసుకుంటున్నారు. సీ, జావా అంటూ రకరకాల కోర్సులు నేర్చుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ జాబ్ కోసం కంపెనీల ముందు క్యూ కడుతున్నారు. చిన్న కంకపెనీ అయినా ఫరవాలేదు.. ముందు జాయిన్ అయతే అనుభవం వస్తుందని అనుకుంటున్నారు. స్టార్టప్‌లో అనుభవం తెచ్చుకుని, ఆ తర్వాత మల్టీ నేషనల్ కంపెనీలకు వెళ్లిపోతున్నారు.

ఇక బయట సమాజంలో కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలు.. చాలా గౌరవం ఇస్తారు. అంతగా క్రేజ్ పెరిగిపోయింది. లక్షల్లో జీతం, పార్టీలు. ఇక వాట్ నాట్. సాఫ్ట్ వేర్ జాబ్ వస్తే చాలు.. లైఫ్ ఇక సెటిల్ అయిపోనట్లే అని యువత మనస్సులో నాటుకుపోయింది. సాప్ట్ వేర్ మోజులో పడి మన సాంప్రదాయమైన వ్యవసాయాన్ని యువత మరిచిపోతుంది. సాఫ్ట్ వేర్ జాబ్ తెచ్చుకుంటే లక్షల్లో జీతం పాటు లక్షల్లో కట్నం వస్తుందని, వ్యవసాయం చేస్తే పిల్ల దొరకవడం కూడా కష్టంగా ఉందని యువత బహుమాటంగానే చెబుతున్నారు.

కానీ ఇందుకు భిన్నంగా ఆలోచించాడు మేడ్చల్ కు చెందిన హరికృష్ణ. లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్ వేర్ జాబ్ ను వదిలేసి వ్యవసాయం వైపు మళ్లాడు. వ్యవసాయం చేయడానికి పోలం లేదు. వ్యవసాయం ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ ధైర్యంతో ముందుకు సాగాడు. హైడ్రోపోనిక్స్ సేద్యం గురించి బాగా స్టడీ చేసి తన ఇంటి డాబా మీదే పంట పండిస్తున్నాడు. మట్టి అవసరం లేకుండా కేవలం నీటితోనే పంట పండిస్తున్నాడు.

మట్టి లేకుండా నీటితోనే పంట పండించడం హైడ్రోపోనిక్స్ సేద్యం ప్రత్యేకత. విదేశాల్లో ఈ సేద్యం బాగా పాపులర్ అయింది. కానీ ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ టెక్నాలజీ అడుగుపెడుతోంది. దాని గురించి తెలుసుకున్న హరికృష్ణ.. ఇప్పుడు తన ఇంటి మీదే కొత్తిపూర, పుదీనా, పాలకూర, మెంతికూర, తోటకూర, గోంగూర పండిస్తున్నాడు.

ప్రతి గంటకు ఒకసారి నీటిని మార్చడం వల్ల ఆకుకూరలు కూడా చాలా ప్రెష్‌గా ఉంటున్నాయని హరికృష్ణ చెబుతున్నారు. మొదట్లో చాలా కష్టాలు పడ్డానని, ఇప్పుడు మంచి లాభాలు వస్తున్నాయని చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More