Success Story

మేడ పై మల్లెపూల సాగుతో.. వేలల్లో సంపాదిస్తున్న మహిళ!

KJ Staff
KJ Staff

ఆధునిక వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి ప్రమాదకర రసాయనాలను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల మనం తినే ఆహారంతో పాటు నేల, నీరు,గాలి ప్రమాదకరం పురుగు మందుల అవశేషాలతో నిండిపోయింది ఇలాంటి ఆహారాన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.ఈ సమస్య నుంచి బయట పడడానికి చాలా మంది మిద్దె తోటల పెంపకం (టెర్రస్‌ గార్డెనింగ్‌) లో ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన
టెర్రస్‌ గార్డెనింగ్‌ విధానంలో సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పువ్వులను సాకు చేయడానికి పట్టణ ప్రజలు ఆసక్తి చూపిస్తూ అర్బన్ కిసాన్ గా మారుతున్నారు.ఈ నేపథ్యంలో మంగళూరుకు చెందిన న్యాయవాది కిరణా దేవాదిగ తన ఇంటి టెర్రస్‌పై కుండీల్లో సువాసనలు వెదజల్లే మల్లె పూలమొక్కలు పెంచుతూ లక్షల ఆదాయాన్ని పొందడమే కాకుండా,నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇటీవలే కిరాణా మాట్లాడుతు వ్యవసాయం చేయాలనే కోరిక చిన్నప్పట్నుంచి ఉండేదని, పట్టణాల్లో జీవించడం వల్ల కల నెరవేరలేదు. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కువ రోజుల ఇంట్లో గడపడం వల్ల వ్యవసాయం గురించి ఆలోచించడానికి సమయం దొరకడంతో ఆన్ లైన్లో మల్లె సాగు విధానం గురించి తెలుసుకొని తన టెర్రస్ పై కుండీలలో శంకరపుర మల్లిగే అని పిలువబడే ఉడిపి మల్లెలను పెంచాలని నిర్ణయించుకుంది.

తన ఇంటి టెర్రస్ పై మొక్కలు పెంచాలని నిర్ణయం తీసుకున్న తరువాత సుమారు 90 మొక్కలను నర్సరీ నుంచి కొనుగోలు చేసింది.అయితే మొక్కలు నాటడంలో మెలుకువలను నర్సరీ యజమాని మంచి తెలుసుకుని 100 కుండీలను కొనుగోలు చేసి ఎర్రమట్టి, నల్లమట్టి, సేంద్రియ ఎరువు సమపాళ్ళలో కలిపి కుండీలలో వేసి మొక్కలు పెంచేందుకు సిద్ధం చేసింది.

నర్సరీ నుంచి తెచ్చుకున్న మల్లె మొక్కలు నాటేందుకు మూడు రోజుల సమయం పట్టిందని, మొక్కలు నాటి మూడు నెలల తర్వాత నుంచి పూలు పూడయం మొదలు పెట్టాయని అన్నారు.ఈ మొత్తం పనికి దాదాపు 12 వేల రూపాయలు ఖర్చు అయ్యింది.
ఇప్పటివరకు పూలు అమ్మడం ద్వారా 85,000 రూపాయలు సంపాదించినట్లుగా ఈ సందర్భంగా తెలియజేసింది.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More