Success Story

మహిళా రైతు సాహసం.. ఇప్పుడు లక్షలు సంపాదిస్తుంది

KJ Staff
KJ Staff

కష్టేఫలి అన్నారు పెద్దలు.. కష్టపడితే తప్పనిసరిగా ఎప్పటికైనా ఫలితం వస్తుంది. మనిషి అన్న తర్వాత ఎవరికైనా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ కష్టాలను ఎదురుక్కొని పోరాడితేనే జీవితం. కష్టాలు ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు వస్తాయి.. రేపు పోతాయి. అందుకే కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు. సమర్థవంతంగా ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొన్నవారే సక్సెస్‌ఫుల్ అవుతారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అవుతారు. అలా ఎదుర్కొన్నవారే దేనినైనా సాధించగలరు.

ఇక పురుషుల విజయవంతం కావాలంటే సులువు. కానీ ప్రస్తుత కాలంలో మహిళలు ఏ రంగంలోనైనా విజయవంతం కావాలంటే చాలా కష్టం. కానీ ఇప్పుడు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులకు పోటీగా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. చాలా కంపెనీలు మహిళలను ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో మహిళలకు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ పెద్ద వ్యాపారవేత్తలుగా మారుతున్నారు.

ఇప్పుడు అలాంటి ఒక మహిళ కథ గురించి తెలుసుకుందాం. నాసిక్‌కు చెందిన నవిత లబాడే అనే మహిళ ఒక ప్రమాదంలో తన భర్తను పొగోట్టుకుంది. భర్త పేరు ఆత్మారామ్. ఆయన చిన్న రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ విధి విక్రయించి ఆత్మారామ్ గుండెపోటుతో మరణించాడు. దీంతో నవిత లబాడేకు కుటుంబ పోషణ కష్టమైంది. తన ఇద్దరు పిల్లలను ఎలా పోషించాలో ఆమె అర్థం కాలేదు.

అయితే క్రుంగిపోకుండా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. రైతుగా మారి కూరగాయలతోపాటు సోయాబీన్, గోధుమ పంటలు వేసి డబ్బులు సంపాదించింది. ఆ డబ్బులతో మసాలా దినుసుల తయారీ చేయడం ప్రారంభించింది. ఒక జనరల్ స్టోర్ పెట్టిన తాను తయారుచేసిన మసాలా దినుసుల పోడిని విక్రయించింది. దీని ద్వారా ఆమె లక్షలు సంపాదిస్తుంది.

ఇక తనకున్న పోలంలో చెరుకు పంట వేసింది. దాని ద్వారా కూడా డబ్బులు వస్తున్నాయి. ఇలా ఆమె నెలకు లక్షలు సంపాదిస్తూ చుట్టుపక్కలవారికి స్పూర్తిగా నిలుస్తోంది. మహిళలు స్వశక్తితో ఎలా ఎదగాలనే దానికి ఆమె ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా విజయవంతమైన మహిళలు ఎంతోమంది ఉన్నారు.

ఆమె కొడుకు ఎలక్ట్రానిక్స్‌లో కోర్సు చేస్తున్నాడు. కూతురు పోలీస్‌ సర్వీస్‌లో చేరడానికి శిక్షణ తీసుకుంటోంది. బాధలను దిగమింగుకుని కష్టపడటం వల్లే ఇదంతా సాధ్యమైందని ఆ మహిళ చెబుతోంది. 

Share your comments

Subscribe Magazine

More on Success Story

More