ప్రతి కథకు ఎదో ఒక ప్రారంభం ఉంటుంది, ఈ కథ మహారాష్ట్ర, చింద్వాడాలోని ఒక చిన్న గ్రామంలో మొదలయ్యింది. ఆ గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పరస్రామ్ యాదవ్ అనే ఒక రైతు ఉన్నాడు. పరస్రామ్ తన కష్టం మరియు శ్రమతో తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో, అతని జీవిత ప్రయాణంలో మహీంద్రా ట్రాక్టర్స్ ఎటువంటి పాత్ర పోషించాయి తెలియచేసేదే ఈ కథ.
పరస్రామ్ వ్యవసాయాన్నే జీవనోపాధిగా నమ్ముకున్న ఒక సాధారణ రైతు. వ్యవసాయాన్ని ఒక పనిగకంటే, ఒక అలవాటుగా భావించేవాడు పరస్రామ్. అయితే అతను వ్యవసాయం ప్రారంభించిన కొత్తలో, వ్యవసాయ అవసరాల కోసం హెచ్ఎంటీ ఉపయోగించేవాడు. అతని చెమటనే పైరుకు నీటిలా చిందిన పనిచేసినా ఎప్పుడు అనుకున్నంత దిగుబడి వచ్చేది కాదు. వ్యవసాయంలో నిత్యం అనేక సవాళ్ళను ఎదురుకుంటున్న సరే పరస్రామ్ వెనుతిరగలేదు. ఎంత కష్టపడినా అనుకున్నంత ఫలితం రావట్లేదన్న బాధ పరస్రామ్ మనసును ఎల్లపుడు కలచివేసింది.
తాను అప్పటివరకు వినియోగిస్తున్న ట్రాక్టర్ వికృయించి కొత్త ట్రాక్టర్ తీసుకోవాలన్న ఆలోచన అతనికి మెదిలింది. అయితే ఏ ట్రాక్టర్ అతని వ్యవసాయానికి అనుకూలమైనదో తేల్చుకోలేని సందిగ్ణంలో పడిన పరస్రామ్, ఏదయితే అదయ్యిందని ఒక ముందగు వేసి అతని దగ్గరలోని ట్రాక్టర్ డీలర్ను సంప్రదించాడు. అతను వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ డీలర్తో పంచుకున్న పరస్రామ్, అతని అన్ని వ్యవసాయ అవసరాలకు అనుగుణమైన ఒక మంచి ట్రాక్టర్ని సూచించాలని డీలర్ని కోరాడు. అప్పుడు ఆ డీలర్ రైతుల ఉత్తమ ఎంపికైన మహీంద్రా ట్రాక్టర్ల గురించి వివరించాడు. అయితే ఆ సమయానికి పరస్రామ్ దగ్గర, కొత్త ట్రాక్టర్ కొనేంత డబ్బు లేదు. అతని పరిస్థితిని అర్ధం చేసుకున్న డీలర్, తన వద్ద ఉన్న మహీంద్రా ట్రాక్టర్ ఉచితంగా పరీక్షించుకునేందుకు ఇచ్చాడు, మొత్తం 15 రోజుల ట్రయిల్ చేసే అవకాశం పరస్రామ్ కి లభించింది.
పరస్రామ్ ఆ ట్రాక్టరును అతని పొలంలోకి తీసుకువెళ్లి పరిక్షించసాగాడు. మహీంద్రా ట్రాక్టర్ల యొక్క అత్యద్భుతమైన ప్రతిభను చూసి పరస్రామ్ ఆశ్చర్యపోయాడు. తీసుకుంటే మహీంద్రా ట్రాక్టర్లే తీసుకోవాలన్న దృఢ సంకల్పంతో మొత్తానికి తనకంటూ ఒక మంచి మహీంద్రా ట్రాక్టర్ను తన సొంతం చేసుకున్నాడు. మహీంద్రా ట్రాక్టర్లను ఎంచుకోవడం తానూ జీవితంలో చేసిన మంచి నిర్ణయమని ఆటను ఇప్పటికి భావిస్తాడు. మహీంద్రా ట్రాక్టర్లు వినియోగించడం ద్వారా తాను వ్యవసాయంలో పడుతున్న కష్టాలు తగ్గడమే కాకూండా ఉత్పాదకత కూడా పెరగడం అయన గమనించాడు.
మహీంద్రా సహాయంతో వ్యవసాయంలో అతని మొదటి విజయాన్ని సొంతం చేసుకున్న పరస్రామ్ ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని వ్యవసాయ భూమితోపాటు, ట్రాక్టర్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది, ఇప్పుడతను 90 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు, ఇప్పటివరకు 20 మహీంద్రా ట్రాక్టర్లను కొనుగోలు చేసాడు. ఇప్పుడతను దాదాపు రెండు కోట్ల రూపాయలతో ఒక పెద్ద ఇంటి కూడా నిర్మించుకున్నాడు, ఈ ఇంటి నిర్మాణం ఆటను వ్యవసాయంలో సాధించిన విజయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మహీంద్రా ట్రాక్టర్లు కేవలం అతనికి వ్యవసాయంలో లాభాలను తెచ్చిపెట్టడమే కాకుండా, అతని జీవితంలో మరియు అతని కుటుంబంలో కూడా సుఖసంతోషాలకు కారణమయ్యింది.
పరస్రామ్ తోపాటు ఇప్పుడు అతని కుటుంబ మొత్తం వ్యవసాయాన్నే తమ ప్రధాన వృత్తిగా భావిస్తు ముందుకు సాగుతూ మరిన్ని విజయ శిఖరాలను అధిరోహిస్తున్నారు. పరస్రామ్ యొక్క కథ అందరికి ఎంతో ప్రేరణదాయకం, ఒక మనిషి అతని శ్రమ మరియు నిబద్ధతతో, తన కలలు అన్నిటిని నిజం చేసుకోగలడు అన్నదానికి పరస్రామ్ ఒక గొప్ప ఉదాహరణ. కేవలం పరస్రామ్ జీవితాన్నే కాదు అతనిలాంటి ఎంతోమంది రైతుల జీవితాలను మార్చిన ఘనత మహింద్రకే సొంతం. అటువంటి గొప్ప విజయంలో మీరు కూడా ఒక భాగం కావడానికి మహీంద్రా ట్రాక్టర్లను ఎంచుకోండి. మహీంద్రా రైతుల యొక్క మొదటి ఎంపిక.
Share your comments