Success Story

ద్రాక్ష తోట నుండి అపారవిజయం

KJ Staff
KJ Staff

"అధునాత సాంకేతికతను ఉపయోగించి ఒక వ్యవసాయ కుటుంబం, ప్రతి ఏడాది అత్యధిక లాభాలు ఎలా పొందగలిగిందో ఇప్పుడు తెలుసుకోండి."

ప్రపంచవ్యాప్తంగా వైన్ ఒక విజయ సూచికగా భావిస్తారు. చాల దేశాల్లో వైన్ గ్లాసులతో చీర్స్ చెప్పుకొని, తాము అందుకున్న శిఖరాలకు  ప్రతీకగా  సంబరాలు జరుపుకుంటారు.విజయానికి ప్రతీకగా భావించే  వైన్ తయారీలో అతిముఖ్యమైనది ద్రాక్ష, భారత దేశంలో ఉత్పత్తయిన ద్రాక్ష ఎన్నో దేశాలకు రవాణా అవుతుంది. వైన్ తయారిలో ఇక్కడ పండిన ద్రాక్షకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.

Harshad Rakibe: Happy Customer of Mahindra Tractors
Harshad Rakibe: Happy Customer of Mahindra Tractors

భారత దేశంలో ద్రాక్ష ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ప్రధమ స్థానంలో ఉంది. ఇదే రాష్ట్రానికి చెందిన హర్షద్ రాఖీబే మరియు అతని కుటుంబం, ద్రాక్ష ఉత్పత్తి ద్వారా ఘణనీయమైన లాభాలను పొందుతున్నారు. మహీంద్రా కంపెనీ వారు అందిస్తున్న అత్యాధునిక సాంకేతికతను అలవరుచుకుని ఈ కుటుంబ అపారమైన లాభాలను సొంతం చేసుకుంటుంది. దేశంలోని 40 లక్షలకంటే  ఎక్కువ మంది రైతులు మహీంద్రా ఉత్పత్తులపై అపార నమ్మకం కలిగి ఉన్నారు. దీనికి ఫలితంగా మహీంద్రా ట్రాక్టర్లు, వ్యవసాయ ట్రాక్టర్ల శ్రేణిలో అత్యుత్తమ స్థానంలో నిలిచాయి.

మహీంద్రా ట్రాక్టర్లతో, హర్షద్ రాఖీబేకి విడదీయలేని బంధం ఉంది. హర్షద్  కుటుంబం గత కొన్ని తరాల నుండి మహీంద్రా సేవలను వినియోగిస్తూ వస్తుంది. తమ కుటుంబంతో మహీంద్రా కంపెనీకి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదని, గత 40 ఏళ్ల నుండి తమయొక్క అన్ని వ్యవసాయ అవసరాలకు మహీంద్రా ట్రాక్టర్లనే వాడుతున్నట్టు హర్షద్ తెలిపారు. వారి కుటుంబ ఆర్థికాభివృద్ధిలో మహీంద్రా ప్రధాన పాత్ర పోషిస్తుందని హర్షద్ తన ఆనందం వ్యకతం చేసారు. 

హర్షద్ రాఖీబే అధిక మొత్తంలో ద్రాక్ష సాగు చేస్తున్నందువల్ల, యంత్ర వినియోగం అత్యంత కీలకం. మహీంద్రా ట్రాక్టర్స్ వినియోగించడం ద్వారా దాదాపు తమ అన్ని వ్యవసాయ అవసరాలు పూర్తవుతున్నాయని హర్షద్ ప్రస్తావిస్తున్నారు. మిగిలిన రైతులందరు మహీంద్రా ట్రాక్టర్స్ అందిస్తున్న అత్యుత్తమ ఫీచర్లు వినియోగించుకుని అధిక లాభాలు పొందగలరని తెలిపారు. మహీంద్రా కంపెనీ వారు ద్రాక్ష తోట అవసరాలన్నీ పరిశోధించి,వాటికి తగ్గట్టుగా తమ ట్రాక్టర్లను రూపొందించారు. మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా మహీంద్రా ఎల్లపుడు తమ ట్రాక్టర్లను నవీకరిస్తోంది. ఎంతో వ్యవసాయ వాతావరణాల్లో పరీక్షించాకే మహీంద్రా మీ ముందుకు ట్రాక్టర్లు తీసుకువస్తుంది.

హర్షద్ రాఖీబే తో పాటు ఎంతో మంది రైతుల గుండెల్లో మహీంద్రా స్థానం సంపాదించుకుంది. రైతుల అవసరాలకు తగ్గట్టుగా, ఎన్నో విధాలుగా రూపాంతరం చెందుతూ ఇప్పటి డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఎన్నో స్మార్ట్ ఫీచర్లతో మీ ముందుకు ఎన్నో ట్రాక్టర్లను తీసుకువచ్చింది. ట్రాక్టర్ సామర్ధ్యం మరియు పనితీరుకు సంబంధించిన వివరాలను నేరుగా మీ ఫోన్ కి ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తుంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు మీ టాక్టర్కు సంభందించిన పూర్తి వివరాలను మీరు పొందవచ్చు. మహీంద్రా ట్రాక్టర్స్ తో వస్తున్న ఈ స్మార్ట్ ఫీచర్స్ ఉపయోగించుకుని తమ ద్రాక్ష తోట సామర్ధ్యాన్ని పెంచుకుని అధిక లాభాలు పొందుతున్నట్టు హర్షద్ రాఖీబే తెలిపారు.

మహీంద్రా ట్రాక్టర్ సహాయంతో పంట నాటే దగ్గర నుండి పంట ఓకోత కోసేవరకు అన్ని వ్యవయసాయ పనులకు మీకు తోడుంటుంది. పొలానికి ఎరువులు చల్లడంలో మరియు పురుగుమందులు పిచికారీ చెయ్యడలోను మహీంద్రా ట్రాక్టర్ తనకు ఆసరగా ఉన్నటు హర్షద్ ప్రస్తావించారు. మహీంద్రా ట్రాక్టర్ల వినియోగంతో, తక్కువ సమయంలోనే అన్ని పనులు పూర్తవుతున్నాయని, మరియు తక్కువ ఇంధన వినియోగం ద్వారా డబ్బు ఆదా చేసుకుంటున్నా, అని  హర్షద్ తెలిపారు. సమయం ఆదా కావడం వలన తన కుటుంబంతో గడిపేందుకు మరింత సమయం లభిస్తున్నట్లు హర్షద్ అతని ఆనందం వ్యక్తం చేసారు.

హర్షద్ లాగానే వ్యవసాయానికి ఆధునికత జోడిస్తూ గొప్ప విజయాలు సొంతం చేసుకుంటున్న రైతులందరికీ మహీంద్రా ట్రాక్టర్స్ కృతజ్ఞతలు తెలియచేస్తుంది.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More