Success Story

Success story of Women farmer Sangitha Pingle: సంకల్ప బలం- సంగీత పింగలే స్ఫూర్తిదాయకమైన జీవితం

KJ Staff
KJ Staff

జీవితం ఒక చదరంగం, ఎన్నో మలుపులు, ఊహించని పరిణామాలు చాలానే చోటు చేసుకుంటాయి. మనకు ఎదురయ్యే కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదురుకుని ముందుకు సాగడమే జీవితం. అలాంటి ఊహించని పరిణామాలు ఎన్నో తన మనోదేర్యంతో అధిగమించి గట్టిగ నిలబడిన ఒక మహిళ కథను తెల్సుకుందాం.

సంగీత పింగలే ఒక సాధారణ ఇల్లాలు. తన అత్తమామలు, భర్త పిల్లల శ్రేయస్సు కోసం నిరంతరం ఎంతగానో కష్టపడుతూ ఉండేది. కొన్ని బాధ్యతలతో కూడిన తన చిన్న ప్రపంచం ఎంతో అందమైనది. అంత సంతోషకరమైన ఆ కుటుంబంలోకి ఒక ఆక్సిడెంట్ విషాదఛాయలు   అలుముకునేలా చేసింది. సంగీత భర్త, మరియు ఆమె మామగారు ఆ ఆక్సిడెంట్ లో మృతి చెంది,చక్కని ఆ కుటుంబంలో ఎప్పటికి తీరని విషాదాన్ని మిగిల్చారు. ఆమె భర్త, మామగారు బ్రతికి ఉన్నపుడు అందరూ తమతమ పనులను శ్రద్ధతో నిర్వర్తించేవారు. అయితే ఈ విషాద ఘటన వళ్ళ కుటంబంలో వాళ్ళు అంత దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఆమె తన అత్తగారు మరియు పిల్లల మోకాల్లో దిగులును చూసి తట్టుకోలేకపోయింది

జీవితంలో ఎదురయ్యే సవాళ్లు అన్ని మనోబలాన్ని పరిక్షిస్తాయి అని సంగీత నమ్ముతుంది. ఆ సవాళ్లు అన్ని అధిగమించి ముందుకు సాగినప్పుడే జీవితం యొక్క ముఖ్య సారాంశం అర్ధం అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సంగీత తన రోజువారీ బాధ్యతలతో పాటు, తన భర్త మరియు మామగారు నడుపుతున్న ద్రాక్ష తొట నిర్వహణా    భాద్యతలను కూడా చేపట్టింది. సంగీత తన పరిస్థుతలకు భయపడకుండా వాటిని స్వీకరించి తనకు అనువుగా మార్చుకునే దిశగా సాగింది.

Success story of santosh: పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం

ద్రాక్ష తోటను నిర్వహించడం మామూలు విషయం కాదు. పైగా సంగీత వంటి అనుభవం లేని వ్యక్తులకు ఇది దాదాపు అసాధ్యం. ఒక చిన్న తప్పు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయినా సరే సంగీత నిరాశ చెంది వెనుతిరగలేదు. ద్రాక్ష సాగుకు అవసరమయ్యే పద్ధతులు, మరియు ఇతర మెళుకువలు అన్ని నేర్చుకోవడం మొదలుపెటింది.  తనకున్న  కృషి మరియు పట్టుదలతో కొద్దీ కాలంలోనే ఎంతో అనుభవాన్ని గడించి కొత్త పద్ధతులను సైతం పొలంలో ఆచరించడం మొదలుపెటింది. రోజువారీ పనులను యాంత్రీకరించే సమయంలో, ట్రాక్టర్లను, మరియు ఇతర సాధనాలను తన పొలంలో ఒకటి తర్వాత ఒకటి ఉపయోగించడం మొదలు పెట్టింది. ఇలా కొనసాగిస్తు కొద్దీ రోజుల్లోనే తాను పండించే ద్రాక్ష ఉత్పత్తి మరియు దానికి ఉన్న డిమాండ్ పెరగడం గమనించింది. వ్యవసాయ రంగంలో ఎటువంటి అనుభవం లేకుండా ఇంతటి ఘనత సాధించడం మామూలు విషయం కాదు. సంగీతకి వచ్చిన విజయానికి, గుర్తింపుకు తన నిరంతర శ్రమ మరియు శ్రద్ధ ముఖ్య కారణాలుగా చెపుకోవచ్చు

ఆమెకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ, తన పరిస్థితులను అధిగమించి గొప్ప విజయం సాధించిన సంగీత పింగ్లే జీవితగమనం, తన లాంటి ఎంతో మందికి ప్రేరణాదాయకం. సంగీత మహిళా సాధికారతకు ఒక బలమైన ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రగతి పథంలో పట్టుదలతో ముందుకు సాగుతున్న సంగీత ఎప్పుడూ తన ఆదర్శాలకు కట్టుబడి ఉంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తూనే, ఆమె తన కుటుంబం పట్ల తనకున్న బాధ్యతలను అచంచలంగా మరియు నిష్ఠతో  నిర్వర్తిస్తూనే ఉంది . 

Share your comments

Subscribe Magazine

More on Success Story

More