Success Story

పైలెట్ కలను పక్కనపెట్టి.. వ్యవసాయంలో రాణిస్తున్న మహిళల విజయగాధ!

KJ Staff
KJ Staff

వ్యవసాయం కత్తి మీద సాములా మారిన ఈ రోజుల్లో కొంతమంది రైతులు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముఖ్యంగా కరువు కాటకాలు, వర్షాలు వరదలు, భూగర్భ జలాలు ఎండిపోవడం, సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలను అధిగమించి వ్యవసాయంలో అద్భుత ఫలితాలను సాధించి రాబోయే తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఆఫ్రికాలోని ఉగాండాకు చెందిన మహిళా రైతు సాధించిన విజయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉగాండాకు చెందిన మహిళ గ్రేస్ ఓమురాన్‌ ఈమెది వ్యవసాయ కుటుంబమే అయినప్పటికీ
పైలట్‌గా ఆకాశంలో చక్కర్లు కొట్టాలనేది గ్రేస్‌ ఓమురాన్ జీవిత ఆశయం.అనుకున్నట్లుగానే 2017లో ఈస్ట్ ఆఫ్రికన్ సివిల్ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ తీసుకొని 2019 నాటికి క్యాడెట్ పైలట్‌గా బాధ్యతలు స్వీకరించింది. కొంతకాలానికి ఆమె ప్రెగ్నెంట్ కావడంతో తమ విధులకు సెలవు పెట్టి ప్రసవం కోసం ఇంటికి చేరింది.ఆసమయంలో తనకున్న పరిజ్ఞానంతో
ఖాళీగా ఉన్న తన తండ్రి వ్యవసాయ భూమిలో
మామాడి, నారింజ, జీడి చెట్లను పెంచడమే కాకుండా గ్రేస్ సిట్రస్ అండ్‌ మ్యాంగో ఆర్చర్డ్ వ్యాపారం ప్రారంభించింది.

ఈ ఒక్క నిర్ణయమే ఆమె జీవితాన్ని సమూలంగా మార్చేసింది. అనుకున్నదే తడవుగా మొదట రెండు ఎకరాల్లో మామిడి మొక్కలను పెంచింది.దీంట్లో అద్భుత ఫలితాలు రావడంతో మిగిలిన ఏడు ఎకరాల్లో మామిడి, నారింజ, అవకాడో వంటి రకరకాల పండ్లను పండిస్తూ వివిధ దేశాలకు నాణ్యమైన పండ్లను ఎగుమతి చేస్తూ వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలను సాగిస్తూ దూసుకుపోతోంది. దీంతో పాటే చాలామంది యువతకు వ్యవసాయంపై శిక్షణ ఇస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తోంది.ప్రస్తుతం గ్రేస్ ఓమురాన్‌ తన పైలెట్ కలలను పక్కనపెట్టి తన వ్యవసాయ క్షేత్రం అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యంగా భావిస్తోంది.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More