సాధారణంగా, వ్యవసాయ ఉత్పత్తి ఎరువులపై ఆధారపడి ఉంటుంది. అయితే స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం పంట దిగుబడిపై ప్రభావం చూపిస్తుందని తేలింది.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల నేతృత్వంలోని కొత్త సైన్స్ అడ్వాన్సెస్ అధ్యయనం ప్రకారం, సాధారణ వాయు కాలుష్య కారకాలు తగ్గడం ద్వారా వ్యవసాయ క్షేత్రంలో పంటలపై అనుకూల ప్రభావం పడి దిగుబడి పెరగనున్నట్లు వెల్లడైంది.అధ్యయనంలో, 2018 నుండి 2020 వరకు పంట పచ్చదనం మరియు నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిల యొక్క ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా పంటల దిగుబడి వాయు కాలుష్యం తో ముడిపడి ఉందని కనుగొన్నారు.
సాధారణ కాలుష్య కారకాలలో ఒకటైన నైట్రోజన్ ఆక్సైడ్ల స్థాయి తగ్గడం ద్వారా చైనాలో 25% మరియు పశ్చిమ ఐరోపాలో 10% పంటల దిగుబడి పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు.
నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయిలను సగానికి తగ్గించడం పంటలకు ప్రయోజనం చేకూరుస్తుంది, భారతదేశంలో పంట దిగుబడిలో 8%, చైనాలో 15% మరియు పశ్చిమ ఐరోపాలో 10% వృద్ధికి అవకాశం ఉంది. భారతదేశం , చైనా, దక్షిణ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ మరియు పశ్చిమ ఐరోపాతో సహా మొత్తం ఐదు ప్రాంతాలలో ఉత్తర మరియు దక్షిణ అమెరికాలలో నైట్రోజన్ ఆక్సైడ్లు అత్యల్ప స్థాయిలో ఉన్నాయి.
నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఒక ఫైటోటాక్సిన్, అంటే ఇది నేరుగా మొక్కల కణాలకు హాని చేస్తుంది.అంతే కాకుండా ఓజోన్ హానీ కలిగించే ఇతర కాలుష్య కారకాలు ఏర్పడటానికి కూడా ఇది ప్రధానంగాదోహదపడుతుంది.
నైట్రోజన్ ఆక్సైడ్ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రధాన మార్గం రవాణా వ్యవస్థలను మార్చడం, ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం వంటి చర్యల ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయడం వల్ల “గణనీయమైన” వ్యవసాయ ప్రయోజనాలు లభిస్తాయి అని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని చదవండి.
Share your comments