Agripedia

నేల, విత్తనం నీరు తో పాటు వ్యవసాయానికి తేనెటీగలు చాలా ముఖ్యమైనవి

Srikanth B
Srikanth B

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, మన మనుగడకి పంచ భూతాలైన భూమి, ఆకాశము, వాయువు, జలము మరియు అగ్ని ఎంత అవసరమో తేనె టీగలు కూడా అంతే అవసరం.దీనికి సంబంధించి పూర్తి వివరాలు చదవండి.

మనలో చాలా వరకు తేనెటీగల ప్రయోజనము కేవలం తేనె ఉత్పత్తి వరకే పరిమితం అనుకుంటారు.కానీ వ్యవసాయం లో తేనెటీగల చేస్తున్న కృషి అనిర్వచనీయం. వ్యవసాయంలో ధాన్యం ఉత్పత్తికి, పండ్ల సాగుకి మరియు కూరగాయల పంటలకు పరాగ సంపర్కం చాలా అవసరం. అయితే ఈ పక్రియ ఎక్కువగా తేనెటీగల వలెనే జరుగుతుంది.

తేనెటీగల పెంపకం వల్ల తేనె మరియు మైనపు విలువ కంటే ఎక్కువ ప్రయోజనం వ్యవసాయం లో ఉంటుందని గుర్తించి, భారతదేశంలో మొదటి జాతీయ వ్యవసాయ కమిషన్ (1976) తేనెటీగల పెంపకాన్ని పూర్తిగా వ్యవసాయ ఇన్‌పుట్‌గా సిఫార్సు చేసింది మరియు 2000 వరకు తేనెటీగల పెంపకం కోసం ఒక ప్రణాళికను రూపొందించింది. అయితే దురదృష్టవశాత్తు దీనికి సరైన ప్రాముఖ్యతను దక్కలేదు.

అయితే వ్యవసాయ క్షేత్రంలో వీటి పెంపకం వలన పంటల దిగుబడి పెరుగుతుంది.మొదట్లో, తేనెటీగలు ఒక పెట్టెలో నివసిస్తాయని నమ్మడానికి రైతులు సంకోచించారు. చాలామంది మొదటిసారిగా తేనెటీగ పెట్టెను చూశారు. ఒక సంవత్సరం శిక్షణ కాలంలో, రైతులు తేనెటీగల పెంపకం గురించి సుపరిచితులయ్యారు. ఒక ఎకరంలో కేవలం రెండు తేనెటీగ పెట్టెలు ఉన్నవారు దోసకాయలు, మామిడి మరియు ఉలిపాయ వంటి పంటలలో అధిక దిగుబడిని సాధించారు.

వ్యవసాయం లో మానవులకు తేనెటీగలు కలిగిస్తున్న ప్రయోజనం మరేది కూడా భర్తీ చేయలేదు.తేనెటీగలు తమ ఆహారంగా పుప్పొడి మరియు తేనె కోసం పువ్వులపై ఆధారపడి ఉంటాయి. అయితే తేనెటీగలు పుప్పొడిని తీసుకువెళ్లే క్రమంలో మొక్కలలో పరాగ సంపర్కం జరిగితుంది.

తేనెటీగలు చాలా తెలివైనవి. ఇవి ఒక క్రమ పద్దతిలో క్రమశిక్షణని కలిగి ఉంటాయి. అయితే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే తేనెటీగలు పెద్ద సంఖ్యలో అంతరించిపోతున్నాయి. వ్యవసాయంలో పురుగు మందుల వాడకం మరియు వాతవరణంలో వస్తున్న మార్పులు తేనెటీగలకి ముప్పుని కలిగిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి తేనెటీగలు మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం ఒకవేళ వాటి జాతి పూర్తిగా అంతరిస్తే మానవాళి మనుగడ ప్రశ్నార్ధకంలో ఉంటింది.

మరిన్ని చదవండి.

అరటిని నాశనం చేసే పనామా తెగులు నివారణ చర్యలు!

Share your comments

Subscribe Magazine