Agripedia

పంటను రక్షించుకోవడం కోసం రైతుల అద్భుతమైన ఐడియా!

KJ Staff
KJ Staff

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా పడి భూగర్భజలాలు పెరగడంతో రైతులు వివిధ రకాలైన పండ్ల తోటలను, కూరగాయలను, పూల తోటలను నీటి పారుదల వసతి ఉన్న ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. వర్షాధార ప్రాంతాల్లో ముఖ్యంగా వేరుశెనగ, జొన్న, కొర్ర, పొద్దుతిరుగుడు వంటి పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని సాగుచేసిన పంటలను గింజలు ఏర్పడే దశలో కాపాడుకోవడానికి రైతు సోదరులు మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇటీవల కాలంలో జింకలు, అడవి పందులు నెమళ్లు, అనేక రకాల పక్షులు పంటల పై దాడి చేసి అధికంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ఎంతో శ్రమతో సాగు చేసిన పంటలను పూత, పిందె, కాయ దశలో పక్షుల బారి నుంచి రక్షించుకోవడానికి రాత్రింబవళ్లు నిద్ర లేకుండా పొలాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది.
పైగా అనేక రకాల ప్రమాదాలకు గురి కావాల్సి వస్తోంది.

అటవీ శాఖ అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు విన్నవించుకున్నా సరైన ఫలితం లేకపోవడంతో చాలా మంది రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఛార్జింగ్ తో పనిచేసే పోర్టబుల్ మైక్రో మైకులను కొనుగోలు చేసి తమ పొలాల్లో ఉపయోగిస్తూ అడవి జంతువులు, పక్షులను తరిమివేయడానికి చక్కటి పరిష్కార మార్గంగా ఎంచుకున్నారు.

ప్రస్తుతం చాలా మంది రైతులు తమ పొలాల దగ్గర ఛార్జింగ్ తో పనిచేసే పోర్టబుల్ మైక్రో మైకులను కొనుగోలు చేసి విచిత్రమైన శబ్దాలనురికార్డు చేసి ఉంచారు వీటి నుంచి విచిత్రమైన గట్టి శబ్దాలు వస్తుండటంతో జంతువులు, పక్షులు పారిపోతున్నాయి. ప్రస్తుతం ఈ మైక్రో మైక్ మార్కెట్లో 600 నుంచి 800 రూపాయలు ధర ఉంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 4 నుంచి 5 గంటల సేపు పని చేస్తూనే ఉంటుంది. మంచి ఫలితం ఉండడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మైక్రో మైక్ లే పొలాల్లో దర్శనమిస్తున్నాయి.

Share your comments

Subscribe Magazine