Agripedia

ఏపీలో సాగుచేస్తున్న పైనాపిల్... ఈ పంట ప్రత్యేకతలివే..!

KJ Staff
KJ Staff

అన్ని పండ్లలో కన్నా పైనాపిల్ పండు ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండ్లు అన్ని సీజన్లలో మనకు లభించవు. తద్వారా మార్కెట్ లో ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంది. ఎంతో డిమాండ్ ఉన్న ఈ పంటలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విరివిగా పండిస్తున్నారు. పైనాపిల్ పండించే పంటలకు దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ, మార్కెట్లో ఈ పండ్లకు అధిక డిమాండ్ ఏర్పడినప్పటికీ, రైతులకు మాత్రం పెద్దగా గిట్టుబాటు ధర కాలేదని చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ ప్రాంతం పైనాపిల్ పంటకు ప్రసిద్ధి. ప్రతి ఏటా ఈ ప్రాంతం నుంచి టన్నుల కొద్ది పైనాపిల్ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంట పండడానికి కొండ వాలు భూములలో కొండ దిగువన ఉన్న భూములు పంటకు అనుకూలమని చెప్పవచ్చు.ఈ జిల్లాలో పండించే పంటలను రైతులు ఎలాంటి రసాయన మందులు లేకుండా కేవలం సేంద్రీయ పద్ధతి ద్వారా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పంటలను పండిస్తున్నారు.

సేంద్రీయ పద్ధతి ద్వారా పైనాపిల్ పంటలు పండిస్తున్నపటికి ఇక్కడ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేదు. రైతుల నుంచి ఒక్కో ఆపిల్ పండును కేవలం 5 నుంచి 12 రూపాయల వరకు మాత్రమే లభిస్తుంది. ఈ పండుని మార్కెట్ లో 30 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు పూర్తిగా నష్టపోవడంతో రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడం కోసం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే ఐటీడీఏ అధికారులు రంగంలోకి దిగి స్వయంగా పైనాపిల్ పంటకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ఇప్పటి వరకు సుమారుగా 100 టన్నులను ఐటీడీఏనో విక్రయించింది. కాయ సైజును బట్టి వాటి ధరలను నిర్ణయిస్తూ చిన్న కాయలను రూ.6 నుంచి రూ.10కు, పెద్ద కాయలను రూ.10 నుంచి రూ.12కు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అదేవిధంగా పలు రాష్ట్రాలకు, అలాగే ఇతర దేశాలకు కూడా ఈ పైనాపిల్ పంటలను ఎగుమతి చేయడంతో రైతులకు గిట్టుబాటు ధర కలుగుతుంది. ఎన్నో పోషకాలు కలిగినటువంటి ఈ పైనాపిల్ తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ నేపథ్యంలోనే పైనాపిల్ కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉందని చెప్పవచ్చు.

Share your comments

Subscribe Magazine