మీలో చాల మంది న్యూస్ లో కానీ పేపర్లో కానీ టిష్యూ కల్చర్ గురించి వినివుంటారు. వ్యవసాయ శాస్త్రజ్ఞులకు, మరియు సెల్ బయోలాజిస్టల్కు ఈ పదం సుపరిచితమే. మీకు కూడా టిష్యూ కల్చర్ గురించి తెలుసుకోవాలని ఉంటె ఈ ఆర్టికల్ చదవండి.
మొక్కలు, మరియు ఇతర జంతువుల కణాలను, కుత్రిమంగా పోషకాలు ద్రావణంలో పెంచడాన్ని టిష్యూ కల్చర్ అని పిలుస్తారు. టిష్యూ కల్చర్ ప్రక్రియ, సాధారణంగా మొక్కలను అభివృద్ధి చెయ్యడానికి అధికంగా ఉపయోగిస్తారు. మొక్కలు కణాలకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది, దీని ద్వారా కేవలం మొక్కలోని ఒక్క కణం నుండి పూర్తి మొక్కను అభివృద్ధి చెయ్యచ్చు, ఈ లక్షణాన్ని తోటియొపోటెన్సీ అని పిలుస్తారు. జంతువుల కణాల్లో ఈ లక్షణం లేనందు వల్ల, మనుసులు, లేదా జంతువుల కణాలను టిష్యూ కల్చర్ ద్వారా అభివృద్ధి చెయ్యడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు వాలే జంతువుల కణాల నుండి పూర్తి జంతువును అభివృద్ధి చేయడం అసాధ్యం.
ఇకపోతే మొక్కల కణాలకు ఉన్న ప్రత్యేక లక్షణం ద్వారా ఒక మొక్క నుండి కొన్ని వందల మొక్కలను టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా అభివృద్ధి చేయవచ్చు, ఈ ప్రక్రియను, మైక్రోప్రాపగేషన్ అని పిలుస్తారు. మన ఇండియాతో పాటు అనేక దేశాల్లో ఈ పద్దతిని ఉపయోగించి ఎన్నో రకాల కొత్త రకాలను తయారు అభివృద్ధి చేస్తున్నారు. మనం అధికంగా ఉపయోగించే అరటి, టమాటో, అనాస, రబ్బర్, మరికొన్ని మొక్కలను ఈ టిష్యూ కల్చర్ ద్వారా అభివృద్ధి పెంచుతున్నారు.
టిష్యూ కల్చర్ ద్వారా మరొక్క ఉపయోగం ఏమిటంటే, రోగాలు లేని, అధిక దిగుబడిని ఇచ్చే మొక్కలు సులువుగా అభివృద్ధి చెయ్యవచ్చు. అరటిలోని చాల రకాలు తరచు వైరస్ భారిన పడుతుంటాయి, వైరస్ భారిన పడిన మొక్కల నుండి సాధారణ పద్దతిలో మొక్కలను అభివృద్ధి చేసినట్లైతే, తరువాతి జెనెరేషన్ మొక్కలకు కూడా ఆ వైరస్ సంక్రమిస్తుంది, అదే టిష్యూ కల్చర్ ద్వారా అభివృద్ధి చేసిన మొక్కలకు వైరస్ సంక్రమించదు తద్వారా మొక్క ఆరోగ్యంగా ఎదిగేందుకు వీలుంటుంది.
ల్యాబ్ లో పెంచిన మాంశం:
ఇటీవల కాలంలో, టిష్యూ కల్చర్ పద్దతిని ఉపయోగించి, కుత్రిమంగా మాంసాని కూడా పెంచుతున్నారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు మాంశం నుండి లభిస్తాయి, అయితే జంతు వధను నిషేధించాలి అంటూ కొందరు జంతు ప్రేమికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్లో కుత్రిమంగా మాంసాన్ని పెంచేందుకు, ఏదియైన జంతువూ టిష్యూలోని భాగాన్ని, పోషకాలు ఉన్న టెస్ట్ ట్యూబ్లో ఉంచి, ఇంక్యూబేటర్ సహాయంతో మాంసాని సాగు చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా జంతు వధ తగ్గించవచ్చు.
అయితే టిష్యూ కల్చర్ ద్వారా మొక్కలను అభివృద్ధి చెయ్యడానికీ, అధునాతన మెషిన్స్ అవసరం. ఒక టిష్యూ కల్చర్ లాబొరేటరీ ప్రారంభించడం ఖర్చుతో కూడుకున్న పని. టిష్యూ కల్చర్ నిర్వహించడానికి అనుభవం ఉన్న శాస్త్రజ్ఞుల అవసరం ఉంటుంది.
Share your comments