Kheti Badi

పట్టు పురుగుల పెంపకం ద్వారా ప్రతి నెల నికర ఆదాయం........

KJ Staff
KJ Staff

వ్యవసాయం అనగానే మనకు, పొలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి, కానీ వ్యవసాయ రంగంతో అనుభంధం ఉన్న ఎన్నో రంగాల నుండి జీవనాధారం పొందవచ్చు. అటువంటి వాటిలో పట్టుపురుగుల పెంపకం ఒకటి. పట్టు పురుగులు పెంచుతున్న ఎంతో మంది రైతులు మిగిలిన పంటల్లాగా కాకుండా ప్రతినెలా నికర ఆదాయం వస్తున్నట్లు తెలుపుతున్నారు. పట్టు పురుగుల పెంపకంలో కొన్ని మెళుకువలు పాటించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు.

పట్టు పురుగుల పెంపకాన్ని, సేరి కల్చర్ అని పిలుస్తారు, మన తెలుగు రాష్ట్రాల్లో పట్టు పురుగుల పెంపకం అక్కడక్కడా మాత్రమే కనబడుతుంది, కాబట్టి నిరోద్యోగ యువతకు కానీ, కొత్త వ్యవసాయ వ్యాపారం చేదాం అనుకున్నవారికి పట్టు పురుగుల పెంపకం ఎంతో లాభదాయకం. ప్రభుత్వం కూడా పట్టుపురుగుల పెంపకానికి ఎన్నో ప్రోత్సహకాలను అందిస్తుంది. పట్టు పురుగుల కోసం షెడ్ వెయ్యడానికి, బెడ్లు ఏర్పాటు చెయ్యడానికి, మరియు లార్వాని కొనుగోలుచేసేందుకు ఇలా ప్రతీ అవసరానికి ప్రోత్సహకాలు అందిస్తుంది.

పట్టుపురుగుల్లో రకాలు:

వీటిలో అనేక రకాలు ఉన్నాయి కానీ 4 రకాలు మాత్రం సాగులో ఉన్నాయి. బొంబాక్సీ మోరి, ఏరి, ముగా, తాసార్ ఈ నాలుగు రకాల పట్టు పురుగులు వినియోగానికి అనువుగా ఉంటాయి.

Types of silkworm Image Credit: Brainkit
Types of silkworm Image Credit: Brainkit

మల్బరీ ఆకుల పెంపకం:

పట్టు పురుగులకు ఆహారంగా మల్బరీ ఆకులను అందించాలి. ముల్బరీ చెట్ల పెంపకాన్ని మొరికల్చర్ అని పిలుస్తారు. మల్బరీ ఆకులు మందార చెట్టు ఆకులను పోలివుంటాయి. ఎంత మొత్తంలో పట్టు పురుగులను పెంచుతున్నామో అంతే పరిమాణంలో మల్బరీ ఆకులను పెంచాలి. సాధారణంగా అరెకరంలో పట్టు పెంచుతున్నట్లైతే ఒక ఎకరంలో మల్బరీ చెట్ల పెంపకం చేపట్టాలి. మల్బరీ చెట్లు, విత్తనాలు నుండి లేదా నేరుగా కొమ్మలనుండి పెంచవచ్చు. కొమ్మల ద్వారా పెంపకం చేపట్టినట్లయితే తక్కువ సమయంలోనే దిగుబడి పొందవచ్చు.

లార్వా పెంపకం:

పట్టుపురుగులను పెంచేందుకు ఒక షెడ్ ఏర్పాటు చేసుకోవాలి, షెడ్ లోపలి కాంక్రీట్ లేదా సిమెంట్ నేల వేసుకోవడం ద్వారా పట్టు పురుగులకు వచ్చే రోగాలను నియంత్రిచవచ్చు. పట్టు పురుగులను పెంచేందుకు బెడ్లు చాల అవసరం, నెలల నుండి కనీసం రెండు అడుగుల ఎత్తు ఉండేలా బెడ్లను సిద్ధం చేసుకోవాలి.

పట్టు పురుగు లార్వా గుడ్డు దశ నుండి గుడు దశకు చేరుకోవడానికి సుమారు 22 రోజుల సమయం పడుతుంది. బెడ్లపై మల్బరీ ఆకులను లేదా కొమ్మల పళంగా ఉంచి, గుడ్లను వీటి మీద ఉంచాలి, గుడ్డు నుండి లార్వా బయటకి రాగానే మల్బరీ ఆకులను తింటూ 17-20 రోజులకు 7-8 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయి. లార్వా దశలో ఉన్నపుడు పురుగులు తమ శరీర బరువు కంటే ఎక్కువ ఆహారాన్ని తింటూ గూడు దశకు తమనితాము సిద్ధం చేసుకుంటాయి.

20 రోజుల తర్వాత ఆహారం తినడం తగ్గించి, తమ చుట్టూ గూడును ఏర్పరచుకుంటాయి, దీనినే మనం ప్యూపా స్టేజ్ అంటాం. పట్టు పురుగులు తమ నోటిలోని సెలైవ గ్రంధుల ద్వారా విడుదల చేసిన జిగురు వంటి పదార్ధం గాలికి గట్టిబడి పురుగు చుట్టూ గుడులా ఏర్పడుతుంది. దీనినే మనం ముడి పట్టు అనికూడా పిలుస్తారు.

పట్టు సేకరించడం:

పురుగు చుట్టూ గూడు పూర్తిగ ఏర్పడిన తర్వాత, వీటిని వేడి నీళ్లలో మరిగించడం ద్వారా గూడు లోపల ఉన్న పురుగు మరణిస్తుంది. వేడి నీటికి గూడులో ఉన్న జిగురు వంటి పదార్ధం కరిగి పట్టు సేకరించడానికి అనువుగా మారుతుంది ఈ ప్రక్రియను మొత్తం రీలింగ్ అని పిలుస్తారు.

ఈ విధంగా సేకరించిన పట్టుని మార్కెట్లో విక్రయిస్తారు, సీసన్ బట్టి ఒక కిలో పట్టుకు 450-700 రూపాయిల వరకు రైతులు పొందుతున్నారు.

Share your comments

Subscribe Magazine