Kheti Badi

వేసవి కాలంలో మట్టి యాజమాన్యాన్ని చేపడుతున్నారా?

KJ Staff
KJ Staff

ధాన్యం, పప్పుదినుసులు, చిరుధాన్యాలు పండించే రైతులు, ఖరీఫ్, రబీ పంట సీజన్ తర్వాత పొలాన్ని కాలిగా వదిలేస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు అధికంగా ఉంటుంది, రబీ సీసన్ పంటా కోత తర్వాత ఏప్రిల్ మధ్య నుండి, జూన్ ఆఖరివారం వరకు, పొలం కాలిగా ఉంటుంది. తద్వారా వేసవి కాలంలో వచ్చే తొలకరి వానలకు, పొలం అంత కలుపు మొక్కలు పెరిగిపోవడం రైతులు గమనించవచ్చు. ఈ కలుపు మొక్కలు, మట్టిలోని పోషకాలను, నీటిని పీల్చి మట్టిలో సారం తగ్గేలా చేస్తాయి అంతే కాకూండా కలుపు మొక్కలు కొన్ని శిలింద్రాలకు, పురుగులకు నివాసంగా ఉంటూ, తర్వాత సాగు చేసే మొక్కలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

ఈ పరిస్థితిని నియంత్రించడానికి, ఈ వేసవి కాలంలో మట్టి యజమాన్య పద్దతులను పాటించడం మంచిది. మట్టి తత్వాన్ని బట్టి చదును చెయ్యడం, దుక్కి దున్నడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిగా పొలాలని ఇప్పటి నుండే దున్ని సిద్ధం చేసుకోవడం ద్వారా, వేసవిలో వచ్చే తొలకరి చినుకులు మట్టిలోకి ఇంకి, భూగర్భ జలాల శాతం పెరుగుతుంది.

 

రైతులను ప్రధానంగా వేదించే కలుపు సమస్యను నివారించడంలో వేసవి దుక్కి ఉపయోగపడుతుంది. మొండి కలుపు జాతి మొక్కలైన తుంగ, పార్థీనియం మొదలగు రకాలు, భూమిలో లోతు వరకు దుంపలను, వేర్లును పాతుకుపోయేలా చేస్తాయి, తద్వారా కొంచెం నీటి తడి తగలగానే మొలకెత్తి, సేద్యంలో అవరోధంగా నిలుస్తాయి. వేసవి దుక్కి వల్ల, భూమి అడుగున ఉన్న, కలుపు మొక్కల అవశేషాలు బయటపడి ఎండా వేడికి మరణిస్తాయి. మనం సాధారణంగా ఉపయోగించే గుంటకా, టిల్లర్లు ఉపయోగించి కలుపును నివారించవచ్చు.

వ్యవసాయంలో మరొక్క పెద్ద అవరోధం ఏమిటంటే శిలింద్రాలు, పురుగులు, ఇవి వ్యవసాయ ఖర్చును పెంచడంతో పాటు భారీ పంట నష్టాన్ని కలిగిస్తాయి. కొన్ని పురుగులు, పంట సీసన్ పూర్తయ్యేసరికి, భూమిలోపల గుడ్లు పెడతాయి. రెండవ పంట వేసే సమయానికి గుడ్లు పొదిగి లార్వాలు బయటకు వచ్చి పంట నష్టం కలిగిస్తాయి. వేసవి కాలానికి ముందు మట్టిని దున్నడం ద్వారా, భూమి అడుగున దాగున్న గుడ్లు బయటికి వచ్చి, ఎండ వేడికి చనిపోతాయి, అలాగే లార్వాలను పక్షులు తినడం ద్వారా, పురుగుల బెడద తగ్గించుకోవచ్చు.

అంతేకాకుండా, పంట సాగుచేసిన తర్వాత మిగిలిన మొళ్ళ, కలుపు మొక్కలు, మట్టిని దున్నడం ద్వారా మట్టిలో కలిసి, మట్టిలో కార్బన్ శాతాన్ని పెంచుతాయి, అలాగే కొన్ని పోషక పదార్ధాలు పెరిగే అవకాశం ఉంటుంది. లోతు దుక్కు చేసినప్పుడు, మట్టి అడుగు భాగంలో ఏర్పడే గట్టి పోర తొలగిపోతుంది, దీని మూలంగా, మొక్కల వేర్లు లోతు వరకు పెరిగి, అడుగున ఉన్న నీటిని వినియోగించుకునేందుకు వీలు ఉంటుంది. కనుక వేసవి దుక్కుతో మీ పొలం దిగుబడిని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine