Agripedia

బంతి పూల సాగుతో.. ఎకరాకు లక్షల్లో ఆదాయం..!

KJ Staff
KJ Staff

ప్రస్తుత కాలంలో చిన్న సన్నకారు రైతులకు తక్కువ పెట్టుబడితో సంవత్సరం పొడవునా ఆదాయాన్ని సమకూర్చే బంతిపూల సాగుకు మన రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. బంతిపూలు ఆకర్షణీయమైన రంగులో ఉండి ఎక్కువ కాలం నిలువ ఉండే స్వభావం ఉన్నందువల్ల పూల సాగుదార్లను, వ్యాపారుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా బంతి పూల సాగును పండుగలు, జాతర సమయంలో పూల దిగుబడి వచ్చేటట్లు సాగు చేసినట్లయితే అధిక లాభాలను పొందవచ్చు.

ఈ బంతి పూలు అధిక ఉష్ణోగ్రతలను లేదా వర్షపాతాన్ని తట్టుకోలేవు. వీటి సాగుకు వాతావరణంలో15 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మొక్కలు నాణ్యంగా పెరిగి అధిక పూల దిగుబడిని పొందవచ్చు. అధిక సేంద్రియ పదార్థం గల అన్ని రకాల నేలల్లో బంతిపూల సాగు చేయవచ్చు. ముఖ్యంగా వీటి సాగుకు నేల ఉదజని సూచిక 6.6 - 7 కచ్చితంగా ఉండాలి. నీటి ఎద్దడినికొంత వరకు తట్టుకో గలవు.వారానికి ఒక్కతడి ఇచ్చిన సరిపోతుంది.

బంతిలో పసుపు రంగు పూల నిచ్చే అష్టాగంద రకాన్ని, నారింజ ఎరుపు పూల నిచ్చే ఇండాన్-27 రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు.బంతి మొక్కలు నాటిన 50 నుండి 60 రోజులకు పూయడం ప్రారంభమవుతుంది. సీజన్‌ని బట్టి పూల ధర ఒక కేజీ 25 నుంచి దాదాపు 100 రూపాయలు కూడా పడుతుంది. అయితే పూల ధర ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటుంది. దీన్ని గమనించి రైతులు సాగు చేపడితే మంచిది. ఇంచుమించు ఒక ఎకరంలో బంతి పూల సాగు చేసినట్లయితే ఖర్చులన్నీ పోను సంవత్సరానికి దాదాపు రెండు లక్షల ఆదాయం పొందవచ్చు అని ఈపూల సాగులో అనుభవం ఉన్న రైతులు చెబుతున్నారు.

Share your comments

Subscribe Magazine