Agripedia

ఆవు పేడతో వ్యాపారం అంటే నవ్వారు.. ఇప్పుడు అధిక ఆదాయాన్ని పొందుతున్నారు?

KJ Staff
KJ Staff

పూర్వం ఒక సామెత వాడుకలో ఉండేది. పాడి లేని ఇల్లు, పేడ లేని చేను లేదు... అనే సామెత ఉండేది. కానీ ఈ మోడ్రన్ యుగంలో కూడా  ‘పేడ ఉన్న చోట పేమెంట్స్‌ ఉండును’ అనేది నేటి మాట. ఒకప్పుడు పేడను తీసుకెళ్లి ఊరి బయట పడేసేవారు.అయితే ప్రస్తుతం అదే పేడ ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా అధిక ఆదాయాన్ని పెంపొందింప చేస్తుంది.ఛత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాకు వెళ్లాల్సిందే. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ జిల్లా ఇప్పుడు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచింది.

ఈ రాష్ట్రంలోని చౌరియా, అంబగోర్, తహ్‌షిల్, గుమ్కా, సింఘాల, తెందెసాల్‌... ఇలా రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో ఆవు పేడ అనేది ఆదాయ వనరుగా మారి ఎంతో మంది మహిళలు స్వయం ఉపాధిని కల్పించుకుని అధిక ఆదాయం పొందుతున్నారు. ఆవు పేడను ఉపయోగించి వివిధ రకాల బొమ్మలు,మొబైల్‌ ఫోన్‌స్టాండ్లు, నర్సరీ పాట్స్‌... ఒక్కటనేమిటీ తదితర వస్తువులను ఉపయోగించి నెలకు వేలల్లో ఆదాయం పొందుతున్నారు.

ప్రస్తుతం మహిళలు తయారు చేసినటువంటి ఈ బొమ్మలను కేవలం జిల్లా వరకు మాత్రమే పరిమితమై మార్కెట్ చేసుకునేవారు. కానీ ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్సైట్ లో కూడా ఈ విధమైనటువంటి బొమ్మలు అందుబాటులో ఉండటం వల్ల మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి ఏర్పడింది. 10 మంది మహిళలు కలిపి ఒక సహాయక బృందంగా ఏర్పడి పిడకలతో పాటు ఇతర వస్తువులను తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు.ఈ విధంగా ఆవుపేడతో మహిళలు స్వయం ఉపాధి పొంది అధిక ఆదాయాన్ని పొందుతున్నారని చెప్పవచ్చు.

Share your comments

Subscribe Magazine